చంద్రబాబు గల్ఫ్ పర్యటనలో దుబాయి కింగ్‌ తో భేటీ... APNRT పర్యవేక్షణ

Header Banner

చంద్రబాబు గల్ఫ్ పర్యటనలో దుబాయి కింగ్‌ తో భేటీ... APNRT పర్యవేక్షణ

  Thu Dec 08, 2016 11:09        APNRT, Exclusives, Gulf News, Telugu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనల్లో బిజీ బిజీగా గడపనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడంలో భాగంగా విదేశాల్లో జరిగే సదస్సుల్లో పాల్గొనేందుకు ఆయా దేశాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 11 నుంచి 14 వరకు దుబాయ్‌లో సీఎం పర్యటించనున్నారు. ఇందులో భాగంగా దుబాయి కింగ్‌ ప్రిన్స్‌ క్రౌన్‌తో పాటు బహుళజాతి కంపెనీల సీఈవోలతో చంద్రబాబు భేటీ కానున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆహ్వనించడం కొరకు చర్చలు జరుపనున్నారు. అంతేకాకుండా తన పర్యటన సందర్భంగా అల్ ముక్తుమ్, అల్ నహ్యాన్ మరియు అల్ సభా మూడు రాజ కుటుంబీకుల ప్రతినిధులతో కూడ సమావేశం కావడానికి ముఖ్యమంత్రి ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లుగా సమాచారం.

ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం బాబు వెంట వెళ్ల‌నుంది.అని అధికార వర్గం తెలియజేశారు.

ఈ నేపధ్యంలో ఎపి ఎన్నార్టి సి ఈ ఓ గల్ఫ్ లోని ఏర్పాట్ల విషయమై ఎప్పటికప్పుడు టెలికాన్ఫెరెన్స్ ద్వారా ఎపి ఎన్నార్టి కో ఆర్దినేటర్స్ తో పర్యవేక్షణ చేస్తున్నారు. ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గారికి ఘన స్వాగతం పలకడానికి యు ఏ ఈ లో ఎపి ఎన్నార్టి కో ఆర్దినేటర్స్ భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో యు ఏ ఈ లోని ఎపి ఎన్నార్టి కో ఆర్దినేటర్స్ ఒక సమావేశం ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రి చందరబాబు నాయుడుగారిని కలిసి చర్చించడానికి డిసెంబర్ 11 సాయంత్రం 4 గంటలనుండి 7 గంటలవరకు అనుమతి లభించింది.ఎపి ఎన్నార్టి సి ఈ ఓ డాక్టర్ వేమూరి రవి గారు డిసెంబర్ 10 వ తేదీన దుబైకి చెరుకుంటారు. 11వ తేదీన ముఖ్యమంత్రిని కలిసేలోపు దుబాయ్ లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలని నవ్యాంధ్రలోని పెట్టుబడుల గురించి చర్చిస్తారు. చంద్రబాబు నాయుడిగారి పర్యటనకి సంబంధించిన ఏర్పాట్లని దగ్గరుండి పర్యవేక్షిస్తారు ఎపి ఎన్నార్టి సి ఈ ఓ వేమూరి రవి గారు.


   apnrt observation, apnrt facilitations, cm with apnrt, cm meet dubai king