గుడ్ న్యూస్! కువైట్ లోని కద్దామాల బాగోగుల గురించి AP ప్రభుత్వం ఇంకో ముందడుగు

Header Banner

గుడ్ న్యూస్! కువైట్ లోని కద్దామాల బాగోగుల గురించి AP ప్రభుత్వం ఇంకో ముందడుగు

  Fri Dec 09, 2016 13:09        APNRT, Exclusives, Kuwait, Telugu

ప్రపంచదేశాలలో ఉన్న ప్రవాసుల మరీ ముఖ్యంగా కద్దామాల సమస్యల పరిష్కారం దిశగా ఆంధ్రా ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. ఆ దిశలోనే ఈ నెల 8, 9 తేదీలలో విజయవాడ గేట్ వే హోటల్ లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు 8 డిసెంబర్ 2016 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా ప్రారంభం అయింది. ఈ సదస్సుకు పలువురు రాజకీయ ప్రముఖులు, APNRT సభ్యులు, ఇతర ప్రముఖులు విచ్చేసారు.

మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో APNRT ఆధ్వర్యంలో ప్రవాసుల సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించి, పరిష్కార మార్గాలను కనుగొనే దిశలో విజయవాడలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు లో మొదటి రోజు జరిగిన చర్చాంశాలు మరియు పూర్తి వివరాలు ఇలా....

మొదటిరోజు సదస్సు అనంతరం Dr. K V స్వామి, OMCAP; ఇమిగ్రెంట్స్ ప్రొటెక్టర్, హైదరాబాద్; కువైట్ ఎన్నారైస్ తో కార్యక్రమంలో చర్చించుకున్న అంశాల గురించి తెలిపారు. అవి క్లుప్తంగా.

ఈ సెషన్ కు చైర్ పర్సన్ గా IOM, ఇండియా DG స్పెషల్ ఎన్వాయ్ Dr. మీరా సేథి గారు వ్యవహరించారు. ప్యానలిస్ట్ లుగా కానూరి శేషు బాబు గారు, Director, APNRT; ILO లేబర్ మైగ్రేషన్ స్పెషలిస్ట్ సీతా శర్మ గారు; CDS ప్రొఫెసర్ Dr. ఇరుధ్య రాజన్; ICM చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ Dr.TLS భాస్కర్ గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రికార్డింగ్ ఏజెంట్స్ వారి సెక్రెటరీ. ప్రతినిధులు, హౌస్ వైవ్స్ శిక్షణ ఇస్తున్న ట్రైనర్స్ హాజరయ్యారు.

ఈ సదస్సులో ముఖ్యంగా అంతర్జాతీయ ప్రవాసులంటే ఎవరు, వలస వెళ్ళడం అంటే ఏంటి అనే ఉప్పోద్ఘాతం అయిన తరువాత ఎపి ఎన్నార్టి సి ఈ ఓ డాక్టర్ వేమూరి రవి గారు మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రదేశ్ కోసం ఏమి చేస్తున్నారు, ఏమి చేయబోతున్నారు, వాటికి కావాల్సిన రిక్వైర్మేంట్స్ ఏంటి తామేమి చేయాలి, సంబంధించిన ప్రణాళికలు ముందు చేయబోయే కార్యక్రమాల గురించి మరియు పలు అంశాలపై చర్చించారు.

తరువాత మినిస్ట్రీ ఆఫ్ ఓవర్‌సీస్ ఇండియన్ ఎఫైర్స్ (MOIA) అండ్ కాన్ఫెడరేషన్ మొదటి సేకరేట్రీ కృష్ణ కుమార్ గారు మాట్లాడుతూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో వలసలు ఎలా ఉంటాయి ఎలా ముందుకు సాగాలి అనే విషయం పై మాట్లాడారు. తరువాత IOM, ఇండియా DG స్పెషల్ ఎన్వాయ్ Dr. మీరా సేథ్ ఆంద్ర ప్రదేశ్ లో ఉన్న ప్రవాసుల గురించి వారి సమస్యల గురించి వాటి పరిష్కారాల గురించి మాట్లాడారు . తదనంతరం ILO నేషనల్ ప్రోగ్రాం ఆఫీసర్ సీతా శర్మ గారు, ఆంద్రప్రదేశ్ లో ఉన్న డేటా ఏంటి, విదేశాలకి వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్ళాలి, ఏవిధమయిన సపోర్ట్ వాళ్లకి అందించాలి అన్నది తెలియజేసారు. అలాగే ఆమె కొన్ని లేబర్ రిపోర్ట్స్ కూడా సదస్సులో ప్రెజెంట్ చేసారు.

ఆ తరువాత భూటాన్, మాల్దీవ్స్ మరియు శ్రీలంక, ఇండియన్ UN విమెన్ ఆఫీస్ డిప్యూటీ రిప్రజెంటేటివ్ Dr.ఆశా టోర్కెల్ సన్ భారతదేశం నుండి విదేశాలకు వలస వెళుతున్న మహిళల గురించి, పరాయి దేశాలలో వారు అనుభవిస్తున్న బాధల గురించి, వారు విదేశాల బాట పట్టడానికి గల కారణాలు, వాళ్ళకి అందించవలసిన రక్షణ చర్యల గురించి, ముఖ్యంగా విదేశాలలో కద్దామాలుగా పనిచేస్తున్న మహిళల గురించి చర్చించారు. వీరిని ఎలా బయటకి తీసుకురావాలి అన్నది ఎపి ఎన్నార్టి సహకారంతో వారికి అండగా ఉండాలి అని తెలిపారు.

సాయంత్రం సెషన్ లో మరల మినిస్ట్రీ ఆఫ్ ఓవర్‌సీస్ ఇండియన్ ఎఫైర్స్ (MOIA) అండ్ కాన్ఫెడరేషన్ మొదటి సేకరేట్రీ కృష్ణ కుమార్ గారు ఆంద్ర ప్రదేశ్ మైగ్రెంట్స్ సమస్యలు, వాటి పరిష్కారాలు, ఏమి చేస్తే బాగుంటుంది అన్న అంశాలని చర్చించారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ వలసదారులకి ఒక పాలసీ ఏర్పాటు చేసి దాని ద్వారా వారిని ఆదుకునే అవకాశం ఉంటుంది అని ఒక అద్భుతమయిన సలహా ఇచ్చారు.

తరువాత సెషన్లో రెక్రుటింగ్ ఏజెన్సీస్ వారు ఎదుర్కుంటున్న సమస్యలని, కువైట్ లో క్లియరెన్స్ రావడం లేదని, వైజాగ్ లో ఒకే ఒక ఫ్లైట్ నడుస్తోంది ప్రతి దానికి హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ చాల ఖర్చు అవుతోంది, వీటికి పరిష్కారాలని సూచించమని తెలిపారు.

తరువాత స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో ఉన్న నైపుణ్యత, అవకాశాల గురించి, ఇవి రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతాయనే అంశాల గురించి, ప్రపంచవ్యాప్తంగా వీరికి ఉన్న అవకాశాల గురించి, ఎంప్లాయర్, జాబ్ సీకర్స్, లేబర్ యూనియన్స్, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ గురించి కూలంకషంగా చర్చ జరిగింది.

రేపు జరిగే సెషన్ లో స్కిల్ డెవలప్మెంట్ గురించి మరింత చర్చ జరుగుతుంది. రేపటి సదస్సు కి మినిస్టర్ పల్లె రఘునాధ రెడ్డి గారు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని స్వామి గారు తెలిపారు. వలసదారుల సమస్యల పరిష్కారానికి ఇది ఒక గొప్ప ఆరంభం అని, ఎపి ఎన్నార్టి సహకారంతో భవిష్యత్తులో వలసదారుల సమస్యలని పరిష్కరించాలని అలాగే విదేశాలలో ఉన్న డొమెస్టిక్ హౌస్ మెయిడ్స్ ని రక్షించే దిశగా ముందడుగు వేస్తారని, ఈ కార్యక్రమం ఎన్నో సమస్యలకి పరిష్కారం మార్గం అని Dr. K V స్వామి, OMCAP; ఇమిగ్రెంట్స్ ప్రొటెక్టర్, హైదరాబాద్; గారు హర్షం వెలిబుచ్చారు.

కద్దామాలను ప్రభుత్వ రిక్రూటింగ్ ఏజెన్సీ ల ద్వారా మాత్రమే ఒక పద్దతిలో రిక్రూట్ చేసుకునేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు, ఆ దిశలోనే కద్దామా ల గురించి, ఏజెంట్ ల చేతిలో మోసపోతున్న ప్రవాసాంధ్రుల గురించి సాయంత్రం జరిగిన మీటింగ్ లో చర్చించడం జరిగింది. మొదటి రోజు మీటింగ్ లో అన్నీ అంశాల గురించి కొంతమాత్రమే చర్చించినప్పటికీ, రెండవ రోజు మీటింగ్ అన్నింటి గురించి పూర్తి స్థాయిలో, కూలంకషంగా చర్చలు సాగిస్తామని, ప్రవాసులకు, మరీ ముఖ్యంగా మహిళా కద్దామాలకు విదేశాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ రకాల రక్షణ చర్యలు తీసుకునేలా తగిన చర్యలు తీసుకోనున్నట్లు Dr. K V స్వామి గారు కువైట్ ఎన్నారైస్ కు తెలిపారు.


   AP ప్రభుత్వం, ap govt step, kuwait maids problems, indian maids discussion, discussion on maids