కువైట్, గల్ఫ్ వెళ్ళే వారికి శుభవార్త – పల్లె రఘునాధ రెడ్డి

Header Banner

కువైట్, గల్ఫ్ వెళ్ళే వారికి శుభవార్త – పల్లె రఘునాధ రెడ్డి

  Mon Dec 12, 2016 12:30        APNRT, Gulf News, Kuwait, Telugu

మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో APNRT ఆధ్వర్యంలో ప్రవాసుల సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చా కార్యక్రమం విజయవాడ, M.G రోడ్ లోని గేట్ వే హోటల్ లో రెండు రోజుల పాటు జరిగింది. ఈ అంతర్జాతీయ సదస్సు లో రెండవరోజు అనగా డిసెంబర్ 9 వ తేదీన రాష్ట్ర సమాచార, ఎన్నారై శాఖా మంత్రి పల్లె రఘునాధ రెడ్డి గారు పాల్గొన్నారు.

రెండవ రోజు అనగా డిసెంబర్ 9 వ తేదీన జరిగిన సదస్సులో మొదటి సెషన్ కు చైర్ పర్సన్ గా Dr. K. లక్ష్మీ నారాయణ గారు, IAS, APSSDC వ్యవహరించారు.

ప్యానలిస్ట్ లు అపర్ణ IAS  గారు, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, APSSDC;  ILO నేషనల్ ప్రోగ్రాం ఆఫీసర్ సీతా శర్మ గారు; V.V. గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ ఫెలో Dr. S.K. శశికుమార్ గారు; Prof. మనోజ్ పాండా, CESS; FICCI ప్రతినిధి; క్వాలిటీ అష్యూరెన్స్ ఇండియా ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ గారు; ఇండియా స్కిల్స్ CEO రాజేష్ కైమల్ గారు.

ఈ సెషన్ లో ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో ఉన్న నైపుణ్యత, అవకాశాల గురించి, ఇవి రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతాయనే అంశాల గురించి, ప్రపంచవ్యాప్తంగా వీరికి ఉన్న అవకాశాలు, ఎంప్లాయర్, జాబ్ సీకర్స్, లేబర్ యూనియన్స్, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ గురించి చర్చించారు.

తరువాత సెషన్ లో ప్రీ-డిపార్చర్ ఓరియంటేషన్ గురించి చర్చించారు. ఈ సెషన్ కు చైర్ పర్సన్ గా ICM చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ Dr.TLS భాస్కర్ గారు, ప్యానలిస్ట్ లుగా అమిత్ భరద్వాజ్ గారు, IOM; MEA కన్సల్టెంట్ దిల్ బగ్ సింగ్; CDS ప్రొఫెసర్ Dr. ఇరుధ్య రాజన్; OMCAP GM Dr.K.V.స్వామి గారు ఉన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాధ రెడ్డి గారు మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల నుండి ఎక్కువమంది ఏజెంట్స్ చెప్పే మోసపూరిత మాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ నానా అవస్థలు పడుతున్నారని, ఇలాంటి వారిలో 50% మహిళలు ఉండటం బాధాకరమని అన్నారు. నకిలీ ఏజెన్సీ లు మాయమాటలు చెప్పి అమాయకులైన వారిని ఇతర దేశాలకు తీసుకువెళుతున్నారని, ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున రెగ్యులర్ ఏజెన్సీ ద్వారా తగు చర్యలు తీసుకునేలా వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వెళ్ళిన ఎన్ రోల్ చేసి, భాషతో పాటు వారి సామర్ధ్యం పెంపొందించేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్మిక శాఖతో కలిసి పర్యటనలు చేసి సమస్యలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. అర్హత లేని ఏజెన్సీ లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విదేశాలకు వెళ్ళేవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని రఘునాధ రెడ్డి గారు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు IOM, ఇండియా DG స్పెషల్ ఎన్వాయ్ Dr. మీరా సేథి గారు ముగింపు సెషన్ లో ప్రసంగించారు. 

రెండు రోజుల పాటు ప్రవాసుల పై, వారి సమస్యలపై కూలంకష చర్చ జరిపిన అధికారులు, త్వరలో దీనిపై మరో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవాసుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచన చేస్తున్నది.


   kuwait and gulf, expats in gulf countries, minister press release