కువైట్ ప్రవేశపెట్టిన కానూన్ ద్వారా వచ్చే ప్రవాసాంధ్రులకు APNRT సహాయసహకారాలు

Header Banner

కువైట్ ప్రవేశపెట్టిన కానూన్ ద్వారా వచ్చే ప్రవాసాంధ్రులకు APNRT సహాయసహకారాలు

  Mon Dec 12, 2016 16:18        APNRT, Exclusives, Kuwait, Telugu

కువైట్ లో 24000 మంది చట్ట ఉల్లంఘనతో దేశ బహిష్కరణ శిక్ష తో ఉన్న భారత ప్రవాసులకి ఊరట, కువైట్ లో చట్ట వ్యతిరేకంగా ఉన్న 24000 భారత ప్రవాసులకు ప్రభుత్వం ఎటువంటి శిక్షలు, జరిమానాలు లేకుండా స్వదేశానికి పంపించే ఏర్పాటు చేస్తుందని అది కూడా భారత ప్రవాసులు తమంత తాముగా వచ్చి దేశ బహిష్కరణ, లేదా జాబ్ వీసా ట్రాన్స్ఫర్ సమస్యల్లో ఉన్నవారు ఇంటీరియర్ మినిస్త్రీని సంప్రదిచాలి. అప్పుడు వారికి సరి అయిన సహకారం అందజేయబడుతుంది. అని కువైట్ ప్రభుత్వం నుండి ప్రకటన విడుదల అవగానే ఎప్పటినుండో కువైట్ నుండి ఇలా అక్రమంగా ఉంటున్న తెలుగు ప్రవాసులని తమ సహాయ సహకారాలతో బయటకి తీసుకురావాలి అని కృషి చేస్తున్న  కువైట్ ఎన్నారైస్ అధిపతి, ఎపి ఎన్నార్టి మిడిల్ ఈస్ట్ మీడియా కో ఆర్దినేటర్ శ్రీ రాజశేఖర్ గారు ఈ విషయం గురించి ఎపి ఎన్నార్టి సి ఈ ఓ డాక్టర్ వేమూరి రవి గారితో చర్చించగా, రవి గారు వెంటనే దీన్ని గురించి ప్రభుత్వం తో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది.

అలాగే ఇంతకూ ముందు మంత్రి పల్లె రఘునాథ రెడ్డి గారు ఇలా అక్రమంగా కువైట్ లో ఉంటున్న తెలుగు ప్రేవాసుల విషయం సానుకూలంగా స్పందించి వీరికి తప్పక సహాయ సహకారాలు అందిస్తామని వివరాలు తెలుపమని కోరింది.

ఎపి ఎన్నార్టి మరియు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి సహాకారంతో కువైట్ లో ఇల్లీగల్ గా ఉన్న ప్రవాసులని ఆర్థికంగా ఆదుకొని, వారికి కువైట్ ప్రభుత్వం ద్వారా అన్ని విధాల సహాయం అందేలా చేసి స్వగ్రామం తీసుకురావాలని కువైట్ ఎన్నారైస్ ఆకాంక్ష. ఇదే సమయంలో కువైట్ ఎన్నారైస్ ఇలా ప్రకటించడం కూడా శుభసూచకం.

కువైట్ లో అక్రమంగా నివసిస్తున్న తెలుగు ప్రవాసులు సత్వరం తమ వివరాలతో ఇంటీరియర్ మినిస్ట్రీ ని సంప్రదించాలని, ఈ విషయమై ఎప్పటికప్పుడు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల తాజా సమాచారానికి కువైట్ ఎన్నారైస్ ని వార్తలని ఫాలో అవ్వండి.


   kanoon in kuwait, kanoon visa, kanoon for indians