APNRT  మెడికల్ క్యాంపు విజయవంతం.. భారీ సంఖ్యలో పాల్గొన్న చుట్టు పక్కల గ్రామవాసులు

Header Banner

APNRT  మెడికల్ క్యాంపు విజయవంతం.. భారీ సంఖ్యలో పాల్గొన్న చుట్టు పక్కల గ్రామవాసులు

  Wed Dec 28, 2016 15:04        APNRT, Telugu

పేద ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా పలు రకాల వైద్య సేవలు అందించాలన్న దృక్పథంతో నిన్న ఉదయం 9 గంటలకు తుళ్లూరులోని శ్రీ రావెల వెంకట సుబ్బారావు మరియు నాగ శేషగిరిరావు జూనియర్, డిగ్రీ కళాశాలలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసింది ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT).

ఈ మెగా హెల్త్ క్యాంపులో గుంటూరు, విజయవాడ మరియు అబ్రాడ్ నుండి వచ్చిననిపుణులైన వైద్య బృందం వైద్య సేవలు అందించారు. తుళ్లూరు మరియు చుట్టు పక్కల గ్రామవాసులంతా భారీ సంఖ్యలో ఆ వైద్య శిబిరం సేవలను సద్వినియోగపరచుకున్నారు. పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులు కూడా పంపిణీ చేశారు.

APNRT నిర్వహించిన మెగా వైద్య శిబిరం లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగూస్ అధ్యక్షుడు డాక్టర్ రవి కుమార్ వేమూరు, తాడికొండ ఎమ్మెల్యే టి.శ్రవణ్ కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఏపీ విద్యావిధాన పరిషత్ కమిషనర్ డా. దుర్గాప్రసాద్ లు పాల్గొన్నారు.

 



   apnrt medical camp, medical camp for free, free medical camp, free health check ups