మకరజ్యోతి దర్శనానికి వెళ్తున్నారా? అయితే ఇది తప్పక చదవండి.. కువైట్ ఎన్నారైస్ ప్రత్యేక కథనం

Header Banner

మకరజ్యోతి దర్శనానికి వెళ్తున్నారా? అయితే ఇది తప్పక చదవండి.. కువైట్ ఎన్నారైస్ ప్రత్యేక కథనం

  Tue Jan 10, 2017 15:15        Devotional, Exclusives, Telugu

స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ... ఆంధ్రదేశం మారుమ్రోగుతోంది. ఏటేటా అయ్యప్ప దీక్షాదారుల సంఖ్య పెరుగుతూ... కార్తీక మాసారంభంలో జోరందుకున్నాయి. ‘శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం’ అంటూ భక్తులు అచంచల భక్తితో... అత్యంత కఠినమైన నియమనిష్ఠలతో దైవంపై సంపూర్ణ విశ్వాసంతో ఈ దీక్షను చేపడుతున్నారు. ఆ మణికంఠుడు భక్తుల పాలిట కల్పతరువుగా కోరిన కోర్కెలు తీరుస్తూనే ఉన్నాడు. దానికి ఏటేటా పెరుగుతున్న కన్నెస్వాములే ప్రత్యక్ష నిదర్శనం... 

అయ్యప్ప దీక్ష మతసామరస్యానికి ప్రతీక. కులం, మతం, చిన్న, పెద్దా తేడా లేకుం డా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడ మే దీక్ష పరమార్థం. దీని ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దురలవాట్లకు దూరమై, సంపూర్ణ ఆరోగ్యం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవడుతుంది. కేరళ రాష్ట్రంలో ప్రారంభమైన అయ్యప్ప దీక్ష నేడు దక్షిణ భారతదేశమంతటా విస్తరించింది. అన్ని ప్రాంతాల కంటే మన రాష్ర్టంలోనే అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు కఠిన నియమాలు ఆచ రిస్తూ దీక్షా కాలాన్ని పరిపూర్ణం గావిస్తారనే మంచి పేరుంది. 

ఏటేటా అయ్యప్ప దీక్ష తీసు కునే స్వాముల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ దీక్షలు సాధారణంగా కార్తీక మాసంతో ప్రా రంభమై మకర సంక్రాంతి పర్వదినం వరకు కొనసాగుతాయి. అయ్యప్ప దీక్షా పరులు నలు పు/కాషాయం రంగుల్లో దుస్తులు ధరించి 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో ఉద యం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు నిర్విహస్తూ తరిస్తున్నారు. దీక్ష తీసుకున్న స్వా ములు ప్రతి ఒక్కరిని దేవుడి ప్రతి రూపంగా భావిస్తూ ‘ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప’ నామాన్ని జపిస్తుంటారు. దీక్ష వల్ల మనఃశ్శాం తి, క్రమశిక్షణ ధార్మిక భావాలు పెంపొందుతా యంటారు గురుస్వాములు.

దీక్ష నియమాలు...

అయ్యప్ప దీక్ష తీసుకోవాలనుకునే స్వాములు ముందుగా 108 తులసి లేదా రుద్రాక్షలతో అయ్యప్ప స్వామి ప్రతిమను కలిగిన మాలను అల్లించుకోవాలి. నల్ల బట్టలు, మాల తీసుకుని సమీపంలోని అయ్యప్ప దేవాలయాల్లో గురు స్వామితో కానీ ఆలయ అర్చకులతో కానీ మాలధారణ చేయించుకోవాలి. మాల మెడలో పడిన క్షణం నుంచి దీక్ష ప్రారంభమవుతుంది. నల్ల బట్టలు, నుదుట గంధం బొట్టు ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా నడవాలి. ప్రతివారి ని అయ్యప్ప స్వామి ప్రతి రూపంగా భావించి ‘స్వామి’ అని సంబోధించాలి.

ప్రతి రోజు సూ ర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చన్నీళ్లతో శిరస్నానం చేయాలి. ఉద యం, సాయంత్రం వేళల్లో స్వామి వారికి పూజలు నిర్వహించాలి. ఒక పూట భోజనం చేసి రాత్రి పూట అల్పాహారం లేదా పాలు, పళ్లు మాత్రమే తీసుకోవాలి. కటిక నేల మీద నిద్రించాలి. దీక్షా కాలంలో క్షుర కర్మలు చేయడంగాని, వేలి గోర్లను తీయడంగాని చేయకూడదు. ఆడవారిని తోబుట్టువులుగా, తల్లిగా భావించాలి. కోపతాపాలకు, అశుభ కార్యాలకు దూరంగా ఉండాలి. ప్రతి రోజూ దైవరాధన చేస్తూ ప్రశాంత జీవనం గడపాలి. 41 రోజుల పాటు దీక్షను కొనసాగించిన అనంతరం ఇరుముడి ధరించి శబరిమల యాత్రను పూర్తి చేయాలి. శబరియాత్ర పూర్తి చేసి ఇంటికి చేరిన తర్వాత తల్లితో కానీ, భార్యతో కానీ లేదా దేవాలయ అర్చకుల చేత మాల విరమణ చేయించుకోవాలి.

పడి పూజ...

అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు తమ దీక్షా కాలంలో మెట్ల పూజ (పడిపూజ) నిర్వ హించి కనీసం ఐదుగురు స్వాములకు భిక్ష (భోజనం) లేదా అల్పాహారం పెట్టడం ఆనవా యితీ. పడిపూజ నిర్వహించాలనుకున్న వారు అరటి బోదెలతో మండపం నిర్మిస్తారు. అందు లో అయ్యప్ప స్వామి చిత్ర పటాన్ని ఏర్పాటు చేస్తారు. శబరిమల దేవాలయం వద్ద ఉన్నట్లు గా 18 మెట్లను తయారు చేసి, ఒక్కో మెట్టు ను ఒక్కో దేవుడి ప్రతి రూపంగా భావించి మె ట్ల పూజ నిర్విహస్తారు. మెట్ల పూజలో భాగం గా అయ్యప్ప స్వామికి వివిధ రకాల అభిషేకా లు నిర్వహిస్తారు. పడిపూజలో స్వాములు పాల్గొని భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. 

దీక్షతో ఆరోగ్యం...

అయ్యప్ప మండల దీక్షతో ఆధ్యాత్మిక చింతన తో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శాస్ర్తీ య పద్ధతుల ప్రకారం పురాతన కాలం నుంచి కొన్ని రకాలైన వ్యాధులకు ఆయుర్వేద చికిత్స చేయడానికి, యోగ సాధనకు మండల కాలం (41 రోజులు) ప్రామాణికంగా వాడుతున్నారు. చన్నీటి స్నానం, ఒక్క పూట భోజనం, దేవతా రాధన వంటి అలవాట్లు మనిషి జీవితంపై చక్క టి ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఉద యం, సాయంత్రాలలో చన్నీటి శిర స్నానాలు చేయడం వల్ల మెదడులోని సున్నిత నరాలు స్పందించి సునిశిత శక్తి, ఏకాగ్రత, ఉత్తేజం కలగడమే కాకుండా శరీరంలోని వేడి కూడా సమతుల్యమవుతుంది. నుదుటిపై చందనం, కుంకుమ, విభూతి ధరించడం వల్ల భృగు మధ్య భాగంలోని అతి సున్నిత నరాలకు చల్ల దనాన్ని ఇవ్వడమే గాక గంధం సువానస మానసిక ప్రశాంతతనిస్తుంది.

వనమూలికల తో తయారయ్యే విభూతి యాంటీబాక్టీరియల్‌ గా పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుం ది. దీక్షా కాలంలో ధరించే నలుపు రంగు బట ్టలు వేడిని గ్రహించి దేహానికి వెచ్చదనాన్ని ఇస్తా యి. కాళ్లకు చెప్పులు ధరించకుండా నవడవ డం వల్ల భూమిపై ఉండే చిన్న చిన్న రాళ్లు, మ ట్టి గడ్డలు పాదాలకు సున్నితంగా గుచ్చుకుని ఓ రకంగా ఆక్యూపంక్చర్‌ చర్య జరిగి నరాల కు స్పందన కలుగుతుంది. దాంతో శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఒం టి పూట భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ క్రమబద్ధీకరించబడుతుంది. అయ్యప్ప దీక్షతో మానసిక, శారీరక ఉత్తేజం కలిగి అత్మస్థైర్యం, ఏకాగ్రత పెంపొందుతాయి. 

అయ్యప్పకు కన్నెస్వామి అంటే ప్రీతి

అయ్యప్ప దీక్షను పురుషులు ఏ వయసు లో ఉన్నా కుల, మత భేదం లేకుండా తీసు కోవచ్చు. అమ్మాయిలైతే పదేళ్ల లోపు వారు, మహిళలైతే 55 ఏళ్ల పైబడ్డ వారు మాత్రమే దీక్ష తీసుకునేందుకు అర్హులు. మొదటిసారిగా అయ్యప్ప దీక్ష తీసుకునే వారిని కన్నె స్వాములుగా, రెండవ సారి తీసుకున్న వారిని కత్తి స్వాములుగా, మూ డవ సారి గంట స్వాములుగా, నాల్గవ సారి గద స్వాములుగా, ఐదవ సారికి గురుస్వా ములుగా పిలుస్తారు. వీరందరిలో కన్నె స్వాములకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కొన్ని సంవత్సరాల పాటు దీక్ష తీసుకున్న స్వాములు ప్రతి ఏటా ఒకరిద్దరు కొత్త వ్య క్తులతో దీక్ష చేపట్టించి తమ వెంట శబరి మలకు తీసుకెళ్తారు. అయ్యప్ప స్వామికి కన్నె స్వాములంటే మహా ఇష్టమని ప్రతీతి.

యాత్ర అంత కష్టమా ?

అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి చాలా మంది జంకుతారు. ఎందువల్ల? ఈ ప్రశ్న కు చాలామందికి తెలిసిన జవాబు అది అ త్యంత కఠినతరమని. ఇదొక్కటి మాత్రమే కాదు, వారు శబరిమల యాత్ర తప్పనిసరి గా చేయాలి. నలబై ఒక్క రోజులకు బదులు ఏదో కొద్ది రోజులు మాల వేసుకొని, శబరి మల వరకు వెళ్ళకుండా, మరెక్కడో ఒక అయ్యప్పస్వామి ఊరువెళ్ళి దీక్షను ముగించే వారి గురించి కూడా వింటున్నాం. నిబంధన ప్రకారమైతే దీక్ష ఎంత కఠినమో శబరిమల యాత్ర కూడా అంతే సాహసోపేతం. చాలా మందిని భయపెడుతున్న అంశాలలో ఇదీ ప్రధానమైంది. 

నిజానికి శబరిమలయాత్ర అంత కష్టమా? అంటే కాదనే చెప్పాలి. దైవం పై పరిపూర్ణ విశ్వాసం, ప్రేమతో ముందుకు వస్తే అలాం టి భయాలేవీ ఉండవు. పిల్లలు, వృద్ధ స్ర్తీలు, వృద్దులు, వికలాంగుల సైతం అనేక కష్టాల కు ఓర్చుకుంటూ అడవి మార్గంలో కాలినడ కన వెళ్ళగా లేనిది అన్నీ ఉన్న అనేకమంది అందుకు ముందుకు రాకపోవడానికి అసలై న కారణం సంకల్ప లోపం. వారికి నిజంగా దైవం మీద భక్తి ఉంటే ఎవరికీ తెలియని ఆ ధ్యాత్మిక శక్తి స్వయంగా వారిని నడిపించు కుంటూ వెళుతుంది. 

దీక్ష తీసుకున్న వారికి అడుగడుగునా కష్టాలు కలగడం సహజం. అవి కేవలం స్వామి పరీక్షలే తప్ప మరోటి కాదనుకోవాలి. చివరకు ఆ భగవంతుడి మీ దే సమస్త భారాలు వేసి అన్నింటినీ, అందరి నీ వదిలి అడవి మార్గంలో బయలు దేరుతా రు. నియమాలు, నిష్ఠల విషయంలో ఏ మే రకు క్రమశిక్షణను పాటిస్తామన్న దాని పైనే వారి భక్తి నాణ్యత ఆధారపడి ఉంటుందన్న ది గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిసారి దీక్ష తీసుకొనే వారు విధిగా పెద పాదం గుండా నే వెళ్ళాలన్న నియమం ఒకటి ఉంది. భయ పడే వారు భయపడుతున్నా, ప్రగాఢ భక్తి తత్పరతతో ఆ మార్గం గుండానే వెళుతున్న వారు లక్షల సంఖ్యలో కనిపిస్తారు. 

పదునెట్టాంబడి విశిష్టత...

శ్రీ అయ్యప్ప సన్నిధానంలోని పదునెట్టాం బడి (పదునెనిమిది మెట్లు) ఎక్కడాన్ని భక్తు లు అదృష్టంగా భావిస్తారు. మెట్లను దేవ తలకు ప్రతి రూపాలుగా భావిస్తారు. 18 మెట్లకు 18 విశిష్టతలు ఉన్నాయి.

1వ మెట్టు అణిమ

2వ మెట్టు లఘిమ

3వ మెట్టు మహిమ

4వ మెట్టు ఈశత్వ

5వ మెట్టు వశత్వ

6వ మెట్టు ప్రాకామ్య

7వ మెట్టు బుద్ధి

8వ మెట్టు ఇచ్ఛ

9వ మెట్టు ప్రాప్తి

10వ మెట్టు సర్వకామ

11వ మెట్టు సర్వ సంవత్కర

12వ మెట్టు సర్వ ప్రియాకార

13వ మెట్టు సర్వ మంగళాకార

14వ మెట్టు సర్వ దుఃఖ విమోచన

15వ మెట్టు సర్వ మృత్యువశ్యమణ

16వ మెట్టు సత్యవిఘ్న నివారణ

17వ మెట్టు సర్వాంగ సుందర

18వ మెట్టు సర్వ సౌభాగ్యదాయక

37 ఏళ్లుగా నిరాటకంగా మాలధారణ

రామగుండం ఎన్టీపీసీలో కేరళ రాష్ట్రానికి చెందిన కొందరు పని చేస్తుండేవారు. అయ్యప్ప దీక్ష తీసుకుని వారు చేసే పూజా కార్య క్రమాలు, భజనలను చూసి నేను ఆకర్షితుడనయ్యాను. మళయా ళీల ప్రోత్సాహంతో అయ్యప్ప దీక్షను మొట్టమొదటిసారిగా 1974 లో తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా 37 ఏళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకుని స్వామి సేవలో తరిస్తున్నాను. అయ్యప్ప దీక్షలో ఉన్న మధురానుభూతి మరే దీక్షలో ఉండదనేది నా అభిప్రాయం. మన కోసం... మన కుటుంబం కోసం తీసుకునేదే అయ్యప్ప దీక్ష. దీక్షలో మనసా... వాచా... కర్మణా స్వామిని ధ్యానిస్తూ దీక్షను పరిపూర్ణం గావించాలి. దేహాన్ని కొబ్బరికాయగా, నెయ్యిని ఆత్మగా భావించి జీవాత్మను పరమాత్మకు అర్చన చేసే పవిత్ర ప్రక్రియ ఈ అయ్యప్ప దీక్షలో ఉన్న విశిష్టత. చక్రవర్తుల పురుషోత్తమాచార్యులు, గురుస్వామి 

అయ్యప్ప దీక్షలో కఠిన నియమాలు

అయ్యప్ప దీక్ష కఠిన నియమాలతో కూడు కున్నది. ఎంత నియ మ నిష్ఠలతో ఉంటే అంత సులువుగా శబరియాత్ర చేయ వచ్చు. అయ్యప్ప దీక్షలో కుల మత భేదం, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి ని భగ వంతుడి స్వరూపంగా భావించాలి. 20 ఏళ్ల క్రితం పదుల సంఖ్యలో ఉండే అయ్యప్ప దీక్షాపరులు నేడు వేల సంఖ్యకు చేరుకున్నా రు. ప్రతి యేటా అయ్యప్ప దీక్ష లు తీసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉం ది. మిగతా ప్రాంతాల్లో కంటే మన రాష్ట్రం లోనే అయ్య ప్ప దీక్షను నియమ నిష్ఠలతో చేపడతారు. దీటి సతీష్‌, గురుస్వామ

 

దీక్ష ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపింది

అయ్యప్ప దీక్ష ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపింది. వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకున్న వారు చాలా మంది అయ్య ప్ప దీక్ష తీసుకుని వ్యసనాలకు దూరమయ్యారు. తమ జీవితంలో వచ్చిన మార్పుతో ప్రతి యేటా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ స్వామి సేవలో తరిస్తున్నారు. 16 ఏళ్ల క్రితం అయ్యప్ప దీక్షాపరులు దేవాలయంలో చేసిన పూజలు, భజనలకు ఆకర్షితుడనై స్వామి దీక్ష తీసుకున్న నేను నిరాటంకంగా 16 ఏళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకుని స్వామి దర్శనం చేసుకుంటున్నారు. నా కుటుంబంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని స్వామి సన్నిధానానికి తీసుకెళ్లాను. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా స్వామి సన్నిధానాన్ని దర్శించుకుంటే అంతకు మించిన మహాభాగ్యం లేదు. అడువాల శ్రీనివాస్‌,గురుస్వామి

దీక్షతోనే నా జీవితం మలుపు తిరిగింది.

అయ్యప్ప దీక్షతోనే నా జీవితం మలుపు తిరి గింది. 13 ఏళ్ల క్రితం నా కుటుంబ పరిస్థితి దుర్భరంగా ఉండేది. అయ్యప్ప దీక్ష తీసుకు న్న నేను ఆ తర్వాత జీవితంలో వెనక్కి తిరి గి చూడలేదు. స్వామి దయ వల్ల ఆర్థిక స మస్యలన్నీ తీరిపోయాయి. బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశం వెళ్లిన నేను అక్కడ దీక్ష తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఇక్కడ దీక్షా సమయంలో ఎలా ఉండేవాడినో అక్క డ కూడా ప్రతి సంవత్సరం మాల, నల్లబట్ట లు ధరించకుండానే నియమనిష్ఠలతో అ య్యప్ప స్వామిని ధ్యానించేవాడిని. స్వామి దయ వల్ల ఆర్థికంగా ఎదిగిన నేను స్వామి వారి ఆలయ అభివృద్ధి ఇతోధికంగా సా యం చేస్తున్నాను. మున్ముందు కూడా సా యం చేస్తాను. దీక్ష తీసుకోవడం వల్ల నా జీ వితంలో వచ్చిన మార్పును ప్రతి ఒక్కరికి చెబుతూ దీక్ష తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నాను. రాపర్తి రమేశ్‌, గురుస్వామి

ఇరుముడి...

అయ్యప్ప దీక్షలో ప్రాచుర్యం, పవిత్రత కలిగి ఉండేది ఇరుముడి. ఇరుముడి రెండు భాగా లను కలిగి ఉండి యాత్ర కోసం తలపై ధరిం చేందుకు వీలుగా ఉంటుంది. ఇరుముడిలో ఒ భాగంలో పూజా ద్రవ్యాలు, మరో భాగం లో ఆహార ధాన్యాలు, ఆవు నెయ్యితో నింపిన కొబ్బరి కాయను ఉంచుతారు. శబరిమల అయ్యప్ప దేవాలయం ముందు ఉన్న పదు నెట్టాంబడి ఎక్కాలంటే తలపై ఇరుముడి ఉన్న వారినే అనుమతిస్తారు. దేవాలయానికి చేరు కున్న భక్తులు ఇరుముడిలోని కొబ్బరి కాయ లో నింపిన నెయ్యితో మూల విరాట్టుకు అభిషే కం జరిపిస్తారు. కొబ్బరి ముక్కలను ఆలయ ప్రాంగణంలోని హోమ గుండంలో వేస్తారు. ఇరుముడిలోని ఆహార ధాన్యాలతో భోజనం వండుకుని తింటారు. దేహాన్ని కొబ్బరికాయ గా, నెయ్యిని ఆత్మగా భావించి జీవాత్మను పరమాత్మకు అర్చన చేసే పవిత్ర ప్రక్రియగా ఈ ఇరుముడికి ప్రత్యేకత ఉంది.

శబరిమలై యాత్రలో దర్శనీయ స్థలాలు...

అయ్యప్ప భక్తులు వీలును బట్టి అచ్చన్‌ కోవిల్‌, అరయంగావు, కుళుత్తుపులలో ఉండే అయ్యప్ప దేవస్థానాన్ని దర్శించి పందళ రాజ నివాస స్థలం చూసి ఎరుమేలి చేరుతారు.

ఎరుమేలి...

శ్రీ అయ్యప్ప స్వామి ఆప్తమిత్రుడు, సేవకుడైన వావరుస్వామి వెలసి ఉన్న దివ్య స్థలం ఇది. దీ నినే ‘కొట్టైప్పడి’ అని కూడా పిలుస్తారు. మణి కంఠునిచే సంహరింపబడ్డ మహిషి... తల మొండెం నుండి వేరు చేయబడి ఇక్కడకు విసి రివేయబడింది కాబట్టి ఈ ప్రాంతానికి ‘ఎరు మ’ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఎరుమ ‘ఎరుమేలి’గా మారింది.

ఎరుమేలి చేరిన భక్తులు వయోభేదాన్ని లెక్కించకుండా ఎంతో సంతోషంగా తమ శరీరాలను ఆకులు, కూరగాయలు, పళ్లు, రంగు రంగుల కుంకుమలు, బుడగలతో అలంకరించుకుంటారు. చెక్కతో చేయబడిన చాకు, బాకు, బాణం, గద మొదలైన ఆయుధాలను ధరించి బాజాభజంత్రీలతో ఊరేగింపుగా ‘స్వామి దింతకతోమ్‌... అయ్య ప్ప దింతకతోమ్‌’ అంటూ నాట్యం చేస్తారు. ఈ నాట్యాన్ని ‘పేటైతులాలు’ నాట్యం అంటా రు. యుద్ధ సమయంలో స్వామి మహిషిపైకి ఎక్కి ఈ నాట్యం చేశాడని భక్తుల నమ్మకం. దానికి గుర్తుగా భక్తులు ఈ న్యాటాన్ని నేటికీ ఆచరిస్తున్నారు. నాట్యం చేసుకుంటూ స్వామి వారి భక్తుడైన వావరు స్వామిని మొదటగా దర్శించుకుని అక్కడ విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తారు.

వావరు స్వామి ముస్లిం భక్తుడైనా అయ్యప్ప స్వాములు తమ యాత్రలో కుల, మత భేదాన్ని పాటించరు. వావరు స్వామి ఆలయం నుంచి ఎదురుగా ఉన్న శ్రీ అయ్యప్ప (పేటశాస్తా) ఆలయాన్ని దర్శించుకుని తావళం చేరుకుంటారు. అక్కడి స్నాన ఘట్టాల్లో స్నాన మాచరిస్తారు. పెరియా పాదం (పెద్ద పాదం) నడిచే అయ్యప్ప స్వాములు ఇక్కడి నుంచే తల పై ఇరుముడిని ఎత్తుకుని శరణాలు పలుకు తూ పెరియా పాదయాత్రను ప్రారంభిస్తారు. చిన్న పాదం నడిచే భక్తులు వాహనాల ద్వారా పంబాకు చేరుకుని అక్కడి నుంచి కాలినడకన సన్నిధానానికి చేరుకుంటారు.

పెరూర్‌తోడు...

ఎరుమలై నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణించి ‘పెరూర్‌ తోడు’ చేరతారు. ఇక్కడ చిన్నవాగు దారికి అడ్డంగా ప్రవహిస్తుంది. వీర మణికంఠుడు పులి పాల కోసం వనవాసం చేసే సమయంలో ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకున్నట్లు భక్తులు నమ్ముతారు. పెరూర్‌ తోడు నుంచి ముందుకు ఉన్న అడవి ప్రదే శాన్ని ‘పూంగా’ వనమని అంటారు. పూంగా వనమంటే పూలతోట అని అర్థం.

కాళైకట్టి...

Walk way .

భక్తులు పెరూర్‌తోడు దాటి 12 కిలోమీటర్లు అడవి ద్వారా కొండలెక్కి నడిచి కాళైకట్టి చేరుతారు. మణికంఠుడు మహిషి పైకి ఎక్కి చేసిన నృత్యాన్ని చూడటానికి వచ్చి ఈశ్వరుడు తన వాహనమైన నందిని ఇక్కడ కట్టాడని అందుచేత ఈ స్థలానికి ‘కాళైకట్టి’ అనే పేరు వచ్చిందని చెప్పుకుంటారు.

ఆళుదా నది...

కాళైకట్టి దాటి 5 కిలో మీటర్లు నడిచి ఆళుదా నది చేరుతారు. ఇది పంపానదికి సమానమైన పుణ్య నది. చక్కని ప్రకృతి, సంతోషం కలిగిం చే పరిసరాలు, గలగలమని సాగే నిర్మల నీటి ప్రవాహంతో యాత్రికులకు మనోహరం కలి గించే ప్రదేశం. భక్తులు తొలి మజిలీగా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం ఆళుదా నదిలో స్నానం చేసి ఆ నదిలో చిన్న రాయిని తీసుకుని ప్రయాణం ముందుకు సాగిస్తారు.

ఆళుదామేడు...

ఆళుదానది నుంచి ప్రారంభమైన కొండను ఆళుదామేడు అంటారు. ఇది చాలా ఎతె్తైన ఏట

వాలు కొండ. ఈ కొండను ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. కాలు జారితే పాతాళమే. చుట్టూ దట్టమైన అడవిలో తిరిగే మృగాలను చూడవచ్చు. భక్తులు శరణాలు ప లుకుతూ, ఆ స్వామి అండతో ఈ కొండను ఎ క్కుతారు. ఆళుదామేడు శిఖరం సముద్ర మ ట్టం నుంచి 4 వేల అడుగుల ఎత్తులో ఉండ టం చేత వాతావరణం చల్లగా ఉంటుంది.

కరిమలై...

కరిమలై తూడు దాటిన భక్తులు కరిమల కొం డ ఎక్కడం ప్రారంభిస్తారు. కరిమల ఎక్కడం కష్టం.. కష్టం అని మనం అయ్యప్ప భక్తి గీతా లలో వింటూ వుంటాం. దానిని బట్టి కరిమల ఎక్కడం ఎంత శ్రమతో కూడుకున్నదో ఊహిం చవచ్చు. అయ్యప్ప స్వాములు 41 రోజులు కఠోర దీక్ష చేయడం వల్ల సంపాదించిన శక్తి ఈ కొండ ఎక్కడానికి ఉపయోగపడుతుంది. శ్రీ అయ్యప్ప కృప ఉంటే తప్ప ఈ కొండను దాటడం అసాధ్యం. కరిమలై అంటే కరి (ఏను గుల) కొండ అని అర్థం. మిట్ట మధ్యాహ్న సమయంలో కూడా సూర్య కిరణాలు భూమిపై పడనంత దట్టమైన అటవీ ప్రాంతం. 

ఇక్కడ శ్రీ గంధం, ఎర్ర చందనం చెట్లు విస్తారంగా ఉం టాయి. ఇక్కడ ఏనుగు, పులి, చిరుతపులి మొ దలైన అడవి జంతువులు కనిపిస్తాయి. కరిమ లై కొండ మీద ఒక బావి ఉంది. శ్రీ అయ్యప్ప స్వామి తన భక్తుల నీటి అవసరాన్ని తీర్చడానికి బాణం వేసి ఈ బావిని నిర్మించాడని ప్రతీతి. ఈ బావి ఎప్పుడూ నీటితో కళకళలాడుతుంది. కరిమలై వంకర టింకరలతో కూడిన కాలిబా టలో ఏడు భాగాలుగా పైకి ఎక్కాలి. కరిమలై లో కరిమల నాథస్వామి, కరిమలై అమ్మన్‌ పేర్లతో ఆలయాలు ఉన్నాయి. శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష సరిగా చేయకున్నా, భక్తితో శరణా లు పలుకకున్నా ఈ అమ్మవారు భక్తులను దం డిస్తుందంటారు.

సిరియాన వట్టమ్‌.. పెరియాన వట్టమ్‌..

భక్తులు కరిమల దిగిన తర్వాత సిరియాన వట్టమ్‌ (చిన్న ఏనుగు పాదం) పెరియాన వట్ట మ్‌ (పెద్ద ఏనుగుల పాదం) ద్వారా తమ యా త్రను ముందుకు సాగిస్తారు. ఇక్కడ ఏనుగు లు తిరుగుతూ వుంటాయి కనుక ఈ ప్రదేశాని కి ఆ పేర్లు వచ్చాయి. ఇక్కడ నుంచి 3 కి.మీ. పయనిస్తే పంబానదికి చేరుకుంటారు.

పంబానది...

పంబానది గంగానదితో సమానమైన పరమ పవిత్రమైన స్నాన ఘట్టం. పంబానదికి ఎడమ పక్క వాలి చేత తరుమబడ్డ సుగ్రీవుడు తన అ నుచరులతో తల దాచుకున్న పురాణ ప్రసిద్ధ మైన ముకాచలం ఉంది. రామభక్తుడైన హను మంతుడు పుట్టినది, భక్త శబరి రామ దర్శనా నికి వేచి ఉన్నది ఇక్కడే. సీతాన్వేషణ చేస్తున్న శ్రీరామ లక్ష్మణులను హనుమంతుడు మొదటి సారిగా కలుసుకున్న ప్రాంతమిది. సీతను ఎ త్తుకుపోతున్న రావణుడితో శక్తి ఉన్నంత వర కు పోరాడిన జటాయువుకు శ్రీరాముడు అగ్ని సంస్కారాలు చేసి తర్పణాలు వదిలింది ఇక్కడే.

మాతంగ మహాముని ఆశ్రమం ఉండేది ఇక్కడ నే. అందుచేతనే గంగానదితో సమానంగా పం బా నదిని భావిస్తూ తమ పితృ దేవతలకు అక్క డ తర్పణాలు విడిచి పెడతారు. చాలామంది భక్తులు పంబానదిలో దీపాలను వెలిగించి దీపోత్సవం చేస్తారు. పంబానదిలో స్నానం చేసిన భక్తులకు అనిర్వచనీయమైన అనందం కలిగి యాత్రలో అంతసేపు తాము పడ్డ శ్రమ ను మరిచిపోతారు. ఇది అయ్యప్ప భక్తులందరి కీ అనుభవపూర్వకమైనది. ఇరుముడి వెనుక ముడిలోని ఆహార పదార్థాలను ఉపయోగించి భక్తులు ఇక్కడ వంట చేసుకుంటారు. దీనినే ‘పంబాసద్దె’ అని అంటారు. పంబా తీరాన బస చేసి ఆహారం తయారు చేసి ఆర్పబడిన 108 పొయ్యిలలోని బూడిదను సేకరించి దానికి వస్తక్రాయం చేసి ఇరుముడిలో తాము తెచ్చిన విభూతితో కలిపి అయ్యప్ప స్వామికి అభిషేకం చేయిస్తారు.

గణపతి సన్నిధానం...

పంబా నదిలో స్నానం చేసిన భక్తులు తమ ఇరుముడులను తలపైనెత్తుకుని పంబానది తీ రం నుంచి మెట్ట మీదుగా గణపతి సన్నిధానం చేరుతారు. అక్కడ మెట్లు ఎక్కే భక్తులను ఆ జ న ప్రవాహాన్ని చూస్తుంటే హృదయం పులకి స్తుంది. కడలి తరంగాల వలే కదిలేటి జనులు అనే అయ్యప్ప భక్తి గీతం జ్ఞప్తికి వస్తుంది. గణ పతి పాదం చేరిన భక్తులు గణపతికి కొబ్బరికా య కొట్టి గణపతిని, శ్రీరాముడు, హను మంతుడు, దేవీ ఆలయాలను దర్శిస్తారు.


   kuwaitnris exclusive, ayyappa swamy, sabarimalai, ayyappa deeksha, lord ayyappa,makara jyothi, about ayyappa, story of lord ayyappa