బ్రేకింగ్: జై లవకుశ సక్సెస్ మీట్‌లో సినీ విశ్లేషకులపై విరుచుకుపడిన తారక్

Header Banner

బ్రేకింగ్: జై లవకుశ సక్సెస్ మీట్‌లో సినీ విశ్లేషకులపై విరుచుకుపడిన తారక్

  Mon Sep 25, 2017 21:41        Cinemas, India, Telugu

 జై లవకుశ సక్సెస్ మీట్‌లో సినీ విశ్లేషకులపై జూనియర్ ఎన్టీఆర్ విరుచుకుపడ్డారు. సినిమాను విజయవంతం చేయాలా వద్దా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారని మధ్యలో విశ్లేషకులెవరని తారక్ ప్రశ్నించారు. పేషంట్ ఐసీయూలో ఉన్నప్పుడు రోగి చనిపోయాడా, చనిపోయే ఉంటాడంటూ దారిన పోయే దానయ్యలు చేసే వ్యాఖ్యలు రోగి బంధువులను బాధిస్తాయని తారక్ వాపోయారు. సినిమా విడుదలను ఆయన ఐసీయూలో పేషంట్‌గా పోల్చారు. రోగికి వైద్యం అందించే వైద్యులను ప్రేక్షకులతో పోల్చారు. రోగికి అయినవారిగా, బంధువులుగా ఆయా సినిమాలకు చెందిన హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలని తారక్ చెప్పారు. కాబట్టి సినిమా హిట్టా, ఫట్టా అనేది ప్రేక్షక దేవుళ్లే నిర్ణయించేలోగానే ఇష్టం వచ్చినట్లు రాసి, మాట్లాడి తమ మనోభావాలతో ఆడుకోవద్దని తారక్ హెచ్చరించారు.   బ్రేకింగ్: జై లవకుశ సక్సెస్ మీట్‌లో సినీ విశ్లేషకులపై విరుచుకుపడిన తారక్