‘ఎనర్జీ స్టోరేజ్ ’లో పెట్టుబడులకు ‘ముబదాల’ ఆసక్తి మౌలిక సదుపాయాలు,ఇంధన, సాంకేతిక రంగాల్లో ముబదాల ప్రసిద్ధి సంయుక్త కార్యబృందం ఏర్పాటు ఏపీలో పర్యటించాలని షిమ్మరీని ఆహ్వానించిన చంద్రబాబు
Mon Oct 23, 2017 20:32 Telugu, India, అమరావతి కబుర్లు, APNRT
పెట్టుబడులను ఆకర్షించి నవ్యాంధ్ర ప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం విదేశీ పర్యటన సోమవారం ఆరవ రోజుకు చేరింది. యుఏఈ సాంస్కృతిక శాఖ మంత్రి షేక్ అల్ నహ్యాన్ ముఖ్యమంత్రి గౌరవార్ధం విందు ఇచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి పెట్టుబడుల కంపెనీ ‘ముబదాల (Mubadala ’ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సంస్థ డిప్యూటీ గ్రూపు సీఈవో హోమిత్ అల్ షిమ్మరీ మాట్లాడుతూ ఇంధన నిల్వ వ్యవస్థ (ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్) లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపారు. సెమీ కండక్టర్స్, మినరల్స్, ఏరో స్పేస్, పునరుత్పాదక ఇంధన రంగం, స్థిరాస్థులు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, యుటిలిటీస్, రక్షణ సర్వీసులు, స్థిరాస్థులు, వైద్య ఆరోగ్యం, పెట్టుబడుల రంగాల్లో తమకున్న అనుభవాన్ని షిమ్మరీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఆయారంగాలలో తమ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని భారత్‌లో విస్తరించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమన్నారు. రెండంకెల వృద్ధి రేటు దిశగా పయనిస్తోందని, తమ దేశంలో యువజనాభా అధికమని చెప్పారు. భారత్‌లో ఆంధ్రప్రదేశ్ ‘హ్యాపెనింగ్ స్టేట్’ గా ఉందని, వేగంగా అభివృద్ధి చెందుతున్నదని సీఎం వివరించారు. ప్రపంచ ప్రమాణాలనే తాము గీటురాళ్లుగా నిర్దేశించుకున్నామని, సరళతర వ్యాపారంలో మేము అగ్రగామిగా ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు.
దేశంలో మొదటిస్థానంలో, ప్రపంచంలో తొలి 5 స్థానాలలో ఉండాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సుదీర్ఘ తీర ప్రాంతంతో ఆగ్నేయాసియాకు ఆంధ్రప్రదేశ్ ముఖద్వారంగా ఉందని, రోడ్లు, రైల్వే, అంతర్గత జల రవాణాతో మంచి కనెక్టివిటీ కలిగి వున్నట్లు వివరించారు. వ్యవసాయ శుద్ధి పరిశ్రమల్లో ప్రబల శక్తిగా నిలిచామని, సేంద్రీయ వ్యవసాయంలో ముందున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ‘రాజధాని అమరావతి నిర్మాణంలో మీకు అపార అవకాశాలు ఉన్నాయి. 9 నగరాలు, 27 టౌన్‌షిప్పులతో గ్రీన్ అండ్ బ్లూ సిటీగా అమరావతిని రూపుదిద్దుతున్నాం. అమరావతి వచ్చి అక్కడ మీ పెట్టుబడులను పెట్టే అవకాశాన్ని పరిశీలించండి.
ప్రపంచంలోని 5 ఉత్తమ నగరాలలో ఒకటిగా నిలిచేలా అమరావతిని నిర్మిస్తున్నాం. మీ సారధ్యంలో యూఏఈకి చెందిన ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా మీరు బాధ్యత తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హోమిత్ అల్ షిమ్మరీతో అన్నారు. ఈ అంశంపై సంయుక్త కార్య బృందాన్ని (working group) ఏర్పాటు చేద్దామని షిమ్మరీ ప్రతిపాదించగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. వర్కింగ్ గ్రూపులో ముబదాల గ్రూపు నుంచి ముగ్గురు పేర్లను షిమ్మరి సూచించగా, ఏపీ తరఫు నుంచి అజయ్‌జైన్, సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాస్తి కృష్ణకిశోర్, భారత రాయబార కార్యాలయం నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. కాగా పెట్టుబడులకు అవసరమైన రెగ్యులేటరీ, లీగల్ వ్యవహారాలను వర్కింగ్ గ్ర్రూపు పర్యవేక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సందర్శనకు రావాలని మన:స్ఫూర్తిగా మిమ్మల్పి ఆహ్వానిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు షిమ్మరీని ఆహ్వానించగా ఆయన అంగీకారం తెలిపారు. భారత రాయబారి నవదీప్ సూరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్చలు జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు
డా పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి. సాయిప్రసాద్, ఇంధన, మౌలిక వసతుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, సాల్మన్ ఆరోఖ్యరాజ్, ఎనకమిక్ డెవలప్మెంట్ బోర్డ్ సీఇఓ జాస్తి కృష్ణకిశోర్ తదితరులున్నారు.
CM - Invites - NRT Storage
Copyright © 2016 | Website Design & Developed By : www.kuwaitnris.com
Kuwaitnris try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [kuwaitnris@kuwaitnris.com] and we will remove the offending information as soon as possible.