ఆ మల్టీస్టారర్‌లో సాయిపల్లవి కూడా నటిస్తోందట !

Header Banner

ఆ మల్టీస్టారర్‌లో సాయిపల్లవి కూడా నటిస్తోందట !

  Sun Dec 10, 2017 22:03        Cinemas, India, Telugu

'ఫిదా'తో తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా యువతకు సాయిపల్లవి ఫీవర్ పట్టేసుకుంది. ఆ సినిమాతో అమ్మడు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ ఫిదా చేసి పడేసింది. అంతకు ముందే మలయాళంలో రెండు వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్న సాయిపల్లవిని 'ఫిదా' విజయంతో మరిన్ని ఆఫర్స్ పలకరిస్తున్నాయి. కాగా 'ఫిదా' సినిమా చేస్తున్న సమయంలోనే మీ బ్యానర్‌లో మూడు సినిమాలు చేస్తానని దిల్‌రాజుకు మాటిచ్చిందట ఈ ముద్దుగుమ్మ. ఆ ప్రకారంగానే దిల్‌రాజు సమర్పణలో నాని హీరోగా వస్తున్న 'ఎంసీఏ' సినిమాలో నటించిందట. ప్రస్తుతం షూటింగ్ అంతా ఫినిష్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 

అనుకున్నట్లుగా దిల్‌రాజు తో రెండు సినిమాలు పూర్తయ్యాయి కాబట్టి ఇక ఆయనతో మూడో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దిల్‌రాజు నిర్మాణంలో నితిన్, శర్వానంద్ హీరోలుగా రానున్న మల్టీస్టారర్ సినిమాలో 

ఈమె హీరోయిన్‌గా నటించేందుకు అంగీకరించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు 'దాగుడు మూతలు' అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఇందుకు సంబందించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుందని తెలుస్తోంది.


   ఆ మల్టీస్టారర్‌లో సాయిపల్లవి కూడా నటిస్తోందట !