ప్రవాసాంధ్రుల సంక్షేమానికి పెద్ద‌పీట

Header Banner

ప్రవాసాంధ్రుల సంక్షేమానికి పెద్ద‌పీట

  Tue Sep 25, 2018 15:21        Associations, అమరావతి కబుర్లు, India, Kuwait, Reach Us, Telugu, World


అన్ని విధాలుగా అండ‌గా ఉంటా
తెదేపాకు మీరు స‌హాయం చేయాలి
వచ్చే ఎన్నికల్లో ప్రచారమే కాదు, ఓట్లూ వేయాలి
ఆసక్తి ఉన్నవారికి ప్రజాసేవ చేసే అవకాశం
తెదేపా ఎన్‌ఆర్‌ఐ విభాగం ఏర్పాటు చేస్తాం
న్యూజెర్సీలో ప్రవాసాంధ్రుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్ర‌వాసాంధ్రుల సంక్షేమానికి తాను పెద్ద‌పీట వేస్తాన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు వెల్ల‌డించారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా న్యూజెర్సీ ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో ‘న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ స్టూడెంట్‌ సెనేట్‌’లో నిర్వహించిన ప్రవాసాంధ్రుల సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. న్యూజెర్సీతో పాటు, అమెరికాలోని ఇతర ప్రాంతాల నుంచి సుమారు 4వేల మందికి పైగా తెదేపా అభిమానులు కుటుంబాలతో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్‌ నటించిన దానవీరశూరకర్ణ వంటి సినిమాల్లోని డైలాగ్‌లు చెబుతూ, పాటలు పాడుతూ సందడి చేశారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా నారా చంద్ర‌బాబునాయుడు మాట్లాడుతూ ప్ర‌పంచంలో ఏ దేశంలో ఉన్నా తెలుగు ప్ర‌జ‌ల సంక్షేమానికి నాది బాధ్య‌త అని చెప్పారు. తెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌టమే అదృష్టంగా భావిస్తున్నాన‌న్నారు. ప్ర‌వాసాంధ్రుల సంక్షేమం బాధ్య‌త నేను తీసుకుంటాను..మీరు మాత్రం నాకు అండ‌గా నిల‌బ‌డాలి. తెలుగు దేశం పార్టీకి మీరు స‌హాయం చేయాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మీరు ప్ర‌చారం చేయ‌ట‌మే కాదు...ఓట్లు కూడా వేయాల‌ని కోరారు. ఆస‌క్తి ఉన్న వారికి ప్ర‌జాసేవ చేసే అవ‌కాశాన్ని కూడా క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్ ఆర్ ఐ విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తాన‌ని తెలిపారు. అమెరికాలో అడుగు పెట్టినప్పటి నుంచి తనకు ప్రవాసాంధ్రుల నుంచి ‘మళ్లీ నువ్వే రావాలి’, ‘నీ వల్లే మేం ఇక్కడున్నాం. మా వంతు సహకారం అందిస్తాం’ అన్న నినాదాలు మిన్నంటుతున్నాయని చంద్రబాబు తెలిపారు. వాటిని వింటున్నప్పుడు, ప్రవాసాంధ్రుల ఆనందాన్ని చూసినప్పుడు తన జన్మ సార్థమైందనిపిస్తోందన్నారు. ప్రవాసాంధ్రులకు ఈ ఏడాదే ఓటు హక్కు లభించనుందని, వారంతా వచ్చే ఎన్నికల్లో తెదేపాకి ఓటు వేయడంతో పాటు, పార్టీ తరఫున ప్రచారమూ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తెదేపా మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్‌ నటించిన దానవీరశూరకర్ణ వంటి సినిమాల్లోని డైలాగ్‌లు చెబుతూ, పాటలు పాడుతూ సందడి చేశారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘మీలో చాలా మంది మీరు ఎంచుకున్న రంగాల్లో లక్ష్యాన్ని సాధించారు. ప్రజాసేవ చేయాలనుకునేవారికి అవకాశం కల్పిస్తాం. అలాంటి వారికి తెదేపా వేదికగా నిలుస్తుంది’’ అని భరోసా ఇచ్చారు. అక్టోబరులోగా ప్రవాసాంధ్రులు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వారి సౌలభ్యం కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఐ తెదేపా సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రవాసాంధ్రులకు ఓటు హక్కు బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది, త్వరలోనే రాజ్యసభకు రానుందని, ఓటు హక్కు నమోదుకు ఇప్పటి నుంచీ సిద్ధంగా లేకపోతే నష్టపోతామని చంద్రబాబు పేర్కొన్నారు. వారున్న చోటు నుంచే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ‘‘అమెరికాలోని ప్రధాన నగరాల్లో పార్టీ కమిటీలను వేస్తాం. ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కల్పిస్తాం. తెదేపాపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్‌ఆర్‌ఐ విభాగంలో సభ్యత్వం తీసుకోవాలి. అప్పుడు అవసరమైతే మీ అందరితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడం, మరింతగా సేవలందించడం సాధ్యమవుతుంది’’ అని పేర్కొన్నారు.
వచ్ఛే ఎన్నిక‌ల‌కు సిద్ధం కండి ః చంద్ర‌బాబు
ఎన్నికల ప్రచారానికీ శ్రీకారంలో పిలుపు
వ‌చ్చే ఏడాది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు గాను ముఖ్యమంత్రి అమెరికాలో ఎన్నికల ప్రచారాన్నీ ప్రారంభించారు. ఎన్నికల్లోగా తాను మళ్లీ రావడం సాధ్యపడదు కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో తెదేపాకి ఓటు వేయాల్సిందిగా అందర్నీ ఇప్పుడే కోరుతున్నానన్నారు. ప్రవాసాంధ్రుల్లో ప్రతి ఒక్కరి ఓటు తెదేపాకే పడుతుందన్నారు. ‘‘ప్రవాసాంధ్రులకు ఆత్మగౌరవం అంటే ఎన్టీఆర్‌, ఆత్మవిశ్వాసమంటే చంద్రబాబు మాత్రమే గుర్తుకొస్తారు. అమెరికాలో ఇలా తెదేపా జెండా ఎగురుతుందని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్‌ కూడా అనుకుని ఉండరు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెదేపా జెండా రెపరెపలాడుతుందని ఏనాడూ అనుకోలేదు’’ అని పేర్కొన్నారు. తెదేపా మళ్లీ అధికారంలోకి రావడం అవసరమని భావించే వారంతా దాని కోసం ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఎప్ప‌టిక‌ప్ప‌డు ప‌రిణామాల‌ను తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అండ‌గా ఉండాల‌ని కోరారు.
ప‌లువురికి నివాళి
మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలకు ముఖ్యమంత్రి సభా వేదికపై నుంచి నివాళులర్పించారు. ఇటీవల మరణించిన తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు హరికృష్ణకు ముఖ్యమంత్రి నివాళులర్పించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద అంజలి ఘటించారు. వారి జీవితాల‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల‌ని కోరారు. వారు లేని లోటు పూడ్చ‌లేనిద‌ని పేర్కొన్నారు.
చంద్ర‌బాబుకు అండ‌గా ఉందాం
అమెరికాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తినిధి కోమ‌టి జ‌య‌రామ్‌
ల‌క్ష‌లాది మంది తెలుగు కుటుంబాలు అమెరికాలో స్ధిరపడ్డాయంటే దానికి చంద్రబాబే కారణం. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ప్రవాసాంధ్రులకు గుర్తింపునివ్వడంతో పాటు, మాలాంటి వాళ్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన ఘతన ఆయనకే దక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్తా ఒక సైనికుడిలా పోరాడి తెదేపాని గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైనా ఉంది’’ అని ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధి కోమటి జయరాం పేర్కొన్నారు. ఇప్ప‌టి నుంచి అంద‌రూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తిరిగి వ‌చ్చేందుకు కృషిని ప్రారంభించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో నాట్స్‌ డైరెక్టర్‌ మన్నవ మోహనకృష్ణ, తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, కలపటపు బుచ్చిరామ్‌ ప్రసాద్‌, ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడు డా.రవి వేమూరి, జై తాళ్లూరి, శ్రీనివాస్‌ గుత్తికొండ, శ్రీనివాస్‌ మంచికలపూడి, రామ్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, ఎమ్మెల్యే వరదాపురం సూరి తదితరులు కూడా చంద్ర‌బాబు వెంట ఉన్నారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్టుబ‌డులు పెట్టండి ః చంద్ర‌బాబు
అమెరికా నుంచే వ్యాపారాలు చేయండి..!
ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని, ఇక్కడి నుంచే వ్యాపారాలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ‘‘ఆ రోజు నేను దూరదృష్టితో ఐటీపై శ్రద్ధ పెట్టడం, ఇంజినీరింగ్‌ కాలేజీల ఏర్పాటు వల్లే ఈ రోజు మీరంతా ఇక్కడున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టడం నా లక్ష్యం. దీనికి మీ చొరవ, సహకారం చాలా అవసరం. మీలో ప్రతి ఒక్కరూ శక్తివంతమైన ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని విభాగాలకు సంబంధించిన డేటా మీకు అందుబాటులో ఉంది. దాన్ని ఉపయోగించుకుని మీరు మంచి సొల్యూషన్స్‌ అందజేస్తే, వాటిని అన్ని చోట్లా వినియోగించవచ్చు’’ అని పేర్కొన్నారు. ‘‘2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ని ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం. ప్రతికూలతలున్నాయి. కేంద్రం సహకరించడం లేదు. అయినా వదిలిపెట్టడం లేదు. ప్రపంచంలో ఆంధ్రావనిని అత్యున్నతంగా తీర్చిదిద్దుతాను’’ అని పేర్కొన్నారు. ప్ర‌పంచ‌స్థాయి రాజ‌ధానిగా అమ‌రావ‌తిని తీర్చిదిద్ద‌టానికి కృషిచేస్తున్నాన‌న్నారు. దీనికి ప్ర‌పంచంలోని ఏ దేశంలో ఉన్నా తెలుగు ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించాల‌ని కోరారు.   cm new jersy paryatana