గృహోపకరణాలపై దిగుమతి సుంకం పెంపు

Header Banner

గృహోపకరణాలపై దిగుమతి సుంకం పెంపు

  Wed Sep 26, 2018 22:24        Business, Telugu

 కేంద్ర ప్రభుత్వం బుధవారం దిగుమతుల సుంకాన్ని పెంచింది. అంతగా ముఖ్యం కానటువంటి వస్తువుల దిగుమతులకు కళ్ళెం వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కరెంట్ ఖాతా లోటును తగ్గించేందుకు ఈ చర్య దోహదపడుతుందని పేర్కొంది. 19 వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచినట్లు, ఈ నిర్ణయం బుధవారం అర్దరాత్రి నుంచి అమలవుతుందని తెలిపింది. దీంతో ప్రజలు విమాన ప్రయాణాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఏసీలు, స్పీకర్లు, వాషింగ్ మిషన్లు వంటివాటి కోసం మరి కాస్త అదనంగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది.
 
10 కేజీల కన్నా తక్కువ బరువుగల ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై 20 శాతం సుంకం చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సుంకం 10 శాతం ఉండేది. అదేవిధంగా స్పీకర్లు, రేడియల్ కార్ టైర్లు, ట్రంక్స్, సూట్‌కేసులు, ట్రావెల్ బ్యాగులు, గృహోపకరణాలు, షవర్ బాత్, సింక్, ప్లాస్టిక్‌తో తయారైన టేబుల్‌వేర్, కిచెన్‌వేర్‌లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీపై దాదాపు 50 శాతం వరకు ఈ సుంకం పెరిగింది.


   home appliances