రాష్ట్రానికి రండి కృత్రిమ మేధపై ప్రయోగాలు చేయండి తక్కువ ధరకే భూములిస్తాం: సీఎం చంద్రబాబు పిలుపు అమెరికాలో పలువురు నిపుణులతో చర్చ ఆతిథ్య, ఆహారశుద్ధి రంగాల్లో ‘భారతీ ఎంటర్‌ప్రైజెస్‌’ ఆసక్తి డ్రోన్ల తయారీ, పరిశోధనలో అమెరికా సంస్థ పెట్టుబడి

Header Banner

రాష్ట్రానికి రండి కృత్రిమ మేధపై ప్రయోగాలు చేయండి తక్కువ ధరకే భూములిస్తాం: సీఎం చంద్రబాబు పిలుపు అమెరికాలో పలువురు నిపుణులతో చర్చ ఆతిథ్య, ఆహారశుద్ధి రంగాల్లో ‘భారతీ ఎంటర్‌ప్రైజెస్‌’ ఆసక్తి డ్రోన్ల తయారీ, పరిశోధనలో అమెరికా సంస్థ పెట్టుబడి

  Thu Sep 27, 2018 15:03        Exclusives, Telugu

కృత్రిమ మేధపై (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) క్షేత్ర స్థాయి ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌ను వేదికగా చేసుకోవాలని పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ రంగానికి అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని, తక్కువ ధరకే భూములను కేటాయిస్తామని, ఫిన్‌టెక్‌, బ్లాక్‌ చెయిన్‌, మెడ్‌టెక్‌, డ్రోన్‌ టెస్టింగ్‌, అటానమస్‌ వెహికిల్‌ టెస్టింగ్‌ తదితర విభాగాల్లో ఇప్పటికే ముందడుగు వేశామని వివరించారు. ‘కృత్రిమ మేధ క్లౌడ్‌ హబ్‌ పాలసీ-2018’ పేరుతో ఇప్పటికే ప్రత్యేక విధానం ప్రవేశ పెట్టామని తెలిపారు. అంకుర ఆవిష్కరణల విధానం, ఐవోటీ, డీటీపీ, గేమింగ్‌ అండ్‌ యానిమేషన్‌ విధానాలద్వారా పెట్టుబడులు రాబడుతున్నామని, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలతో సాంకేతిక దిగ్గజాలను ఆకట్టుకుంటున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఏ ఆవిష్కరణ జరిగినా దానిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడమే తమ అంతిమ లక్ష్యమని చెప్పారు. ‘కృత్రిమ మేధ - మౌలిక మార్పు’ అన్న అంశంపై న్యూయార్క్‌లో ఆ రంగానికి చెందిన నిపుణులతో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి చర్యలను వివరించారు.

ప్రాథమిక విద్య నుంచే కృత్రిమ మేధ 
కృత్రిమ మేధకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ప్రాథమిక విద్య నుంచే పరిచయం చేయాలని సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. మూస విధానాలకు స్వస్తి చెప్పి ఆ రంగానికి చెందిన నిపుణులతో విద్యాబోధన జరిగేలా మార్పులు తీసుకురావాలని ప్రతినిధులు సూచించారు. ప్రాథమిక విద్యకు సాంకేతికతను జోడించి ఆంధ్రప్రదేశ్‌ను అత్యుత్తమ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న తమ ప్రయత్నానికి తోడ్పాటునందించాలని ముఖ్యమంత్రి కోరారు. సిలికాన్‌ వ్యాలీలో పలు టెక్నాలజీ సంస్థలకు మార్గదర్శిగా ఉన్న రమణ జంపాల ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. కృత్రిమ మేధ టెక్నాలజీ వినియోగానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను పలువురు అభినందించారు. డేటా క్యాంప్‌ చీఫ్‌ డేటా సైంటిస్ట్‌ డేవిడ్‌ రాబిన్‌సన్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ డైరెక్టర్‌ యూరీ అగియార్‌, ఇన్నోవేటివ్‌ టెక్నాలజీ లీడర్‌ టిమ్‌ సులివాన్‌, రాజ్‌ పాటిల్‌, శ్రీధర్‌ చిట్యాట, నియాల్‌ షెనాయ్‌, రెనా నిగమ్‌, శ్రీరామ్‌ రాజప్ప తదితరులు పాల్గొన్నారు.

 


   రాష్ట్రానికి తరలి రండి