ఆస్ట్రోఫిజిక్స్‌ చదవాలనుంది..

Header Banner

ఆస్ట్రోఫిజిక్స్‌ చదవాలనుంది..

  Sat Sep 29, 2018 14:31        Education, Telugu

ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. తరువాత బీఎస్‌సీ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్‌ చేయాలనుంది. అందించే కళాశాలలేవి? అర్హత వివరాలను తెలపండి.

- రఘు

ఆస్ట్రానమీ/ ఆస్ట్రోఫిజిక్స్‌ చేయాలనుకునేవారు డిగ్రీలో ఫిజిక్స్‌ సబ్జెక్టుగా ఉన్న కోర్సును లేదా ఆస్ట్రోఫిజిక్స్‌ కోర్సును చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎంఎస్‌సీ ఫిజిక్స్‌, అప్లయిడ్‌ ఫిజిక్స్‌, ఆస్ట్రానమీ చేసి గేట్‌/ నెట్‌/ జెస్ట్‌ పరీక్షల ద్వారా పీహెచ్‌డీలో ప్రవేశాన్ని పొంది ఆస్ట్రానమీ చేయడం ద్వారా ఆస్ట్రానమర్‌, స్పేస్‌ ఫిజిసిస్ట్‌ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు ఫిజిక్స్‌, మేథమేటిక్స్‌పై మక్కువ పెంచుకోవాలి. 
ఎంటెక్‌లో ఆస్ట్రోఫిజిక్స్‌ కోర్సును ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌- బెంగళూరు, బీఎస్‌సీ లేదా బీఎస్‌సీ కోర్సును టీఐఎఫ్‌ఆర్‌- పుణె, జేఎన్‌టీయూ-హైదరాబాద్‌, ఉస్మానియా యూనివర్సిటీ- హైదరాబాద్‌ వారు అందిస్తున్నారు. తమ సొంత పరీక్షలు/ ఎంసెట్‌, జేఈఈ మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నారు. ఇంటర్‌లో ఎంపీసీ చదివినవారు డిగ్రీ స్థాయిలో ఆస్ట్రోఫిజిక్స్‌, ఆస్ట్రానమీ కోర్సులు ఎంచుకోవచ్చు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


   ఆస్ట్రోఫిజిక్స్‌ చదవాలనుంది..