హ్యాట్రిక్‌ సాధించిన స్పూర్తి

Header Banner

హ్యాట్రిక్‌ సాధించిన స్పూర్తి

  Sat Sep 29, 2018 14:34        Education, Telugu

 ఈ అమ్మాయి పేరు నిధి మయూరికా. బెంగళూరు, ఒలింపియాడ్‌ పాఠశాలలో తొమ్మిదోతరగతి చదువుతోంది. 15 ఏళ్ల ప్రాయంలోనే ఈ విద్యార్థిని పేరు రాష్ట్రవ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇందుకు కారణం నాసా ఏటా పెట్టే ‘నాసా ఎయిమ్స్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌ ( ఏఎస్సెస్‌)’ లో విజేతగా నిలవడమే. గత రెండేళ్ల నుంచి ఈ అవార్డును వరుసగా అందుకున్న నిధి ఈసారీ  దాన్ని సొంతం చేసుకుంది. తాజాగా మూడుసార్లు తెచ్చుకుని, హ్యాట్రిక్‌ సాధించింది. భవిష్యత్తులో ఖగోళశాస్త్రవేత్తగా కావాలనే నిధి ఆశయానికి ఈ విజయాలు పునాదులుగా నిలవనున్నాయి. 

నిధికి పదకొండేళ్ల వయసు నుంచే సూర్యచంద్రులు, నక్షత్రాలపై అమితాసక్తి ఉండేది. అది గమనించిన స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు ఏటా నాసా నిర్వహించే ‘ఏఎస్సెస్‌’ కాంటెస్ట్‌ గురించి చెప్పారు. దాంతో అప్పట్నుంచీ ఆ పోటీలో నిధి పాల్గొనడం మొదలుపెట్టింది. 
అంతరిక్షంపై ఆలోచనలు... నిధి ఏడో తరగతిలో మొదటిసారిగా ఈ పోటీల్లో పాల్గొంది. అలా మూడేళ్లపాటు తన ఆలోచనలను పంపి, నాసా ప్రశంసలను అందుకుంది. ‘నేను దీని కోసం చాలా కృషి చేశా. స్కూల్‌లో తరగతులు అయిపోయిన తరువాత ఈ పోటీల కోసం చదివేదాన్ని. నా సందేహాలన్నింటినీ మా ఫిజిక్స్‌ సర్‌ని అడిగి తెలుసుకునేదాన్ని. అంతేకాదు, ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఎడిన్‌బర్గ్‌, బోస్టన్‌, ది ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ విశ్వవిద్యాలయాలు నిర్వహించే ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరా. అలా చాలా విషయాలను తెలుసుకున్నా. నా ఆలోచనల మేరకు, అదెంత వరకు సాధ్యమవుతుందనే అంశంపై వర్క్‌ చేసి, ఓ ప్రాజెక్టుగా రూపొందించి పోటీకి పంపేదాన్ని. అలా మూడేళ్లపాటు నా ఆలోచనల ప్రతిరూపాలే ‘సైకతం’, ‘సోహాం’, ‘స్వస్తికం’. ఇవే నన్ను విజేతను చేశాయి...’ అని చెబుతుంది నిధి.  
సైకతం.. భూమి, చంద్రగ్రహాల మధ్య గురుత్వాకర్షణశక్తి ఉండే ప్రాంతంలోని లాగ్‌రేంజ్‌్ పాయింట్‌ వద్ద... మూడు అంతస్తులుగా స్పేస్‌ కాలనీ ఏర్పాటు చేసే ప్రాజెక్టు ఇది. అందులో కృత్రిమ గురుత్వాకర్షణతోపాటు నీరు, ఆహారం, గాలి వంటి నిత్యావసరాలను కల్పించడం.   మనుషులు జీవించడానికి అనువుగా ఏర్పాట్లు చేయడం. ఈ ప్రాజెక్టు ఆలోచనకు నిధి ‘సైకతం’ అనే పేరు పెట్టింది. ఇలా రూపొందించిన స్పేస్‌కాలనీలో నాలుగువేల మందితోపాటు వెయ్యి పెంపుడు జంతువులను ఉంచవచ్చని చెబుతుందామె.    హ్యాట్రిక్‌ సాధించిన స్ఫూర్తి