ఫిలాంత్రోఫిక్ సొసైటీ మ‌రింత అభివృద్ధి సాధించాలి

Header Banner

ఫిలాంత్రోఫిక్ సొసైటీ మ‌రింత అభివృద్ధి సాధించాలి

  Wed Oct 10, 2018 06:47        APNRT, Associations, అమరావతి కబుర్లు, India, Telugu, World

ఫిలాంత్రోఫిక్ సొసైటీ మ‌రింత అభివృద్ధి సాధించాలి
ఐఎస్‌ఒ 9001 సర్టిఫికెట్ అభినంద‌న‌లో మంత్రి కొల్లు ర‌వీంద్ర‌
డాక్ట‌ర్ అద్దంకి రాజాయోనాను అభినందించిన ఎన్ ఆర్‌టి డైర‌క్ట‌ర్ చ‌ప్పిడి రాజ‌శేఖ‌ర్‌
అమ‌రావ‌తి ః తూర్పుగోదావ‌రి జిల్లా రాజ మహేంద్రవరానికి చెందిన ప్రముఖ సంస్థ ఫిలాంత్రోఫిక్‌ సొసైటీకి లండన్‌కి చెందిన ఒటాబు సంస్థచే ఐఎస్‌ఒ 9001: 2015 సర్టిఫికెటేషన్‌ గుర్తింపు లభించింది. రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడలు, న్యాయ, ఎన్‌ఆర్‌ఐ సాధికారిత, సేవలు శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఫిలాంత్రోఫిక్‌ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్‌ అద్దంకి రాజాయోనా మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు రాజా యోనాను కొల్లు రవీంద్ర అభినందన సత్కారం చేశారు. సాంస్కృతిక సేవా కార్యక్రమా లను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహి స్తున్న రాజాయోనా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రవీంద్ర ఆకాంక్షిం చారు. ఎపి ఎన్‌ఆర్‌టి డైరెక్టర్‌ చప్పిడి రాజశేఖర్ మాట్లాడుతూ ఫిలాంత్రోఫిక్ వ్య‌వ‌స్థాప‌కులు డాక్ట‌ర్ అద్దంకి రాజా యోనా చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌న్నారు. వివిధ రంగాల్లో నిపుణులైన వారిని గుర్తించి అవార్డులు, పుర‌స్కారాలు అంద‌జేయ‌టం మంచి ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు. భ‌విష్య‌త్తులో ఆయ‌న మ‌రిన్ని విజయాలు సొంతం చేసుకోవాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో సామాజిక ఉద్యమ నాయకుడు మేదర సురేష్‌, టిడిపి నాయకులు నానాజీ పాల్గొన్నారు.   minister kollu