24న విశాఖ‌లో భార‌త్‌, వెస్టిండీస్ మ‌ధ్య వ‌న్డే

Header Banner

24న విశాఖ‌లో భార‌త్‌, వెస్టిండీస్ మ‌ధ్య వ‌న్డే

  Thu Oct 11, 2018 11:30        APNRT, అమరావతి కబుర్లు, Sports, Telugu


ధ‌ర‌లు త‌గ్గించిన‌ట్లుగా స‌మాచారం
విశాఖ‌ప‌ట్ట‌ణం ః విశాఖపట్నం వేదికగా ఈ నెల 24న భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగే రెండో వన్డే టికెట్ల ధరలను తగ్గించారని తెలుస్తోంది. తొలుత ఈ మ్యాచ్‌ను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు కేటాయించారు. కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదంతో ఆతిథ్యం విశాఖకు మారింది. బీసీసీఐ కొత్త రాజ్యాంగ నిబంధనల ప్రకారం 90 శాతం టికెట్లను విక్రయానికి ఉంచుతున్నారు. 3,500 కాంప్లిమెంటరీ పాస్‌లు ఉన్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో 10 ఆఫ్‌లైన్‌ కౌంటర్ల ద్వారా 6,000 టికెట్లు విక్రయించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రెండో వన్డే నిర్వాహక కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు తెలిపారు.

యూనిమోని ఇండియా ప్రకారం టికెట్ల ధరను తగ్గించారని తెలుస్తోంది. రూ.6,000 టికెట్‌ను రూ.4,000కు, రూ.3500ను రూ.2,500కు, రూ.2,500 టికెట్‌ను రూ.2,000కు విక్రయించనున్నట్లు సమాచారం. మిగతా టికెట్ల ధరలు రూ.1,800, రూ.1,200, రూ.750, రూ.500, రూ.250గా ఉంటాయి. ఈనెల 12న హైదరాబాద్‌లో భారత్‌, విండీస్‌ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే కోహ్లీసేన నగరానికి చేరుకుంది.   sports