అభివృద్ధిప‌థంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Header Banner

అభివృద్ధిప‌థంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

  Fri Oct 12, 2018 14:16        APNRT, Associations, Auto, అమరావతి కబుర్లు, India, Telugu, World


సంక్షోభాల‌ను ఎదుర్కొంటూ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాం
రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్
అమ‌రావ‌తి ః రాష్ట్రం లోటుబ‌డ్జెట్లో ఉన్నా...ఎన్నో ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్నా...వాట‌న్నింటినీ అధిగ‌మిస్తూ ప్ర‌పంచంలోనే అగ్ర‌గామి రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను తీర్చిదిద్ద‌టానికి కృషిచేస్తున్నామ‌ని రాష్ట్రపంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. గురువారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్
ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒప్పందాలు చేసుకోవడంపై లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాల వల్ల నాలుగో పారిశ్రామిక విప్లవం, అధునాతన టెక్నాలజీ వినియోగంలో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందుకేళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నాలుగున్నర ఏళ్ల వయస్సు మాత్రమే ఉన్న స్టార్ అప్ రాష్ట్రామని వ్యాఖ్యానించారు. స్టార్ట్ అప్ కంపెనీలు మొదట్లో ఎలా సంక్షోభాలను ఎదుర్కొంటాయో అలాగే ఏపీ ఇబ్బందులు ఎదుర్కొటుందని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటూ అభివృద్ధి దిశాగా పయనిస్తున్నామని వెల్లడించారు. 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒక్కటిగానూ, 2029 నాటికి దేశంలో నంబర్‌వన్‌గానూ నిలిచేలా లక్ష్యలను నిర్దేశించుకున్నామని అన్నారు. ప్రజలకు సుపరిపాలనా ద్వారా మెరుగైన సేవాలనూ అందించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. ప్రస్తుతం నడుస్తున్న నాలుగో పారిశ్రామిక విప్లవం ద్వారా వస్తున్న అధునాతన టెక్నాలజీని రాష్ట్రంలో అమలు చేయ్యడంలో దేశంలో అందరి కంటే ముందు ఉన్నామని వెల్లడించారు. ప్రధానంగా ఏపీ నూతన రాజధానిలో అమరావతిలో భూముల రికార్డుల అవకతవకలు జరగకూండా పూర్తి టెక్నాలజీను ఉపయోగించి, ఆ భూములకు రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సాధికార సర్వే ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా సరైన సమయంలో జనాభా లెక్కలను సేకరించి, లబ్ధిదారునికి మేలు చేకుర్చే విధంగా చర్యలు తీసుకోన్నట్టు మంత్రి లోకేశ్ తెలిపారు. నాలుగేళ్ల కాలంలో ఎదురైన ప్రతి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ, పరిస్థితులను అవకాశాలుగా మలుచుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకేళ్తున్నామన్నారు. ఈ సదస్సులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీతోపాటు పలుపురు పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్టల్ర మంత్రులు పాల్కొన్నారు.   lokesn