చంద్ర‌బాబుపాల‌న‌లో ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ప్రాధాన్య‌త ఃబుద్ధ‌ప్ర‌సాద్‌

Header Banner

చంద్ర‌బాబుపాల‌న‌లో ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ప్రాధాన్య‌త ఃబుద్ధ‌ప్ర‌సాద్‌

  Fri Oct 12, 2018 14:20        APNRT, Associations, Auto, అమరావతి కబుర్లు, India, Telugu, World

 

అమ‌రావ‌తి ః కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటి వరకు నిర్వహించిన అనేక జాబ్ మేళాలు ద్వారా దాదాపు 1500 మందికి ఉద్యోగాలు కల్పించటం జరిగిందని, ప్రస్తుత జాబ్ మేళా ద్వారా మరో 300 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం స్థానిక డిగ్రీ కళాశాలలో ఏపీఐటీఎ, జెకెసీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్‌మేళాను ప్రారంభించిన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో నిరుద్యోగులు ఉండరాదని, విద్యార్హతలను బట్టి అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు బుద్ధప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమి వారికి, వివిధ కంపెనీల హెచ్‌ఆర్‌లకు బుద్ధప్రసాద్ స్వాగతం పలికారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకుల ఆదరణను జెకెసీ కో-ఆర్డినేటర్ డా. శాంత కుమారి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు బాగున్నాయని ఆయన అభినందించారు. జాబ్ మేళాకు విచ్చేసిన ఆయా కంపెనీల అధిపతులు తమతమ కంపెనీలకు కావల్సిన విదార్హతలు, నిపుణతలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో 250 మంది పేర్లు నమోదు చేసుకోగా ఉద్యోగాలకు ఎంపికైన వారు 85 మంది, మరో 52 మంది సార్ట్ లిస్టులో ఉన్నారని వై రోషిరెడ్డి తెలిపారు. వీరికి నియామక పత్రాలు కళాశాల ప్రిన్సిపాల్ ఇళ్లా రవి బహూకరించగా వైస్ ప్రిన్సిపాల్ భోగాది సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పంట కాలువలకు వేసిన మురుగునీటి పైపుల తొలగింపు
కోడూరు, అక్టోబర్ 11: కోడూరు ప్రధాన పంట కాలువ నుంచి 11వ నెంబరు పంట కాలువ ద్వారా కోడూరు మంచినీటి రిజర్వాయర్ రామారావు చెరువుకు, ఉల్లిపాలెం రక్షిత మంచినీటి పథకం రిజర్వాయర్‌కు నీరు వెళ్లే పరిస్థితుల్లో ఈ పంట కాలువ కోడూరు బైపాస్ రోడ్డు, జనావాసాల పక్కగా ఉండటంతో అందరూ తాము వాడిన మురుగునీరు కాలువలోకి వెళ్లేటట్లు తూములు వేసుకున్నారు. గురువారం గ్రామ ప్రత్యేక అధికారి అశ్వర్ధనారాయణరెడ్డి, కార్యనిర్వహణాధికారి డేగల ఝాన్సీలక్ష్మి, సిబ్బంది ప్రొక్లెయిన్ సహాయంతో కోడూరు తూర్పువైపు సినిమా హాల్ సెంటరు నుంచి ఇంటింటింకి వేసిన తూములను తొలగించారు. అక్రమ తూములు మళ్లీ వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల నవయుగ కంపెనీ ఉల్లిపాలెం బ్రిడ్జికి మెటరీయల్ తరలించేటప్పుడు ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్నందున గృహ యజమానులు తమ ఇళ్లల్లో మురుగునీరు పోయేందుకు రాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా తూములు వేసేశారని రోడ్డు కాంట్రాక్టర్ చెబుతున్నాడు. రోడ్డు పటిష్టంగా రోలింగ్ చేయించిన తరువాత తూములు ఉన్న విషయాన్ని పంచాయతీ అధికారులు గుర్తించి మరలా తవ్వుతున్నారు.   buddaprasad