పిల్ల‌ల్లో పోష‌కాహార లోపం

Header Banner

పిల్ల‌ల్లో పోష‌కాహార లోపం

  Fri Oct 12, 2018 15:08        Health, India, Telugu, World


దేశంలో ఐదుగురు చిన్నారుల్లో ఒక‌రు
జిహెచ్‌ఐ నివేదికలో వెల్లడి
అమ‌రావ‌తి : భారత్‌లో ఐదుగురు చిన్నారుల్లో ఒక్కరు పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారని 2018 గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ (జిహెచ్‌ఐ)నివేదికలో వెల్లడించింది. వారు ఎత్తుకు తగ్గ బరువు కలిగి ఉండటం లేదని( దీనిని వేస్ట్‌(వృథా)గా పేర్కొంది), తీవ్ర పోషకాహార లోపంతో ఉన్నారని పేర్కొంది. ఈ పోషకాహార లోపంతో అధికంగా బాధపడే దేశంగా దక్షిణ సూడాన్‌ నిలిచిందని ఓ నివేదికను జిహెచ్‌పై గురువారం వెల్లడించింది. మొత్తం 119 దేశాలపై చేసిన సర్వేలో భారత్‌ 103 స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి దేశంలో ఆకలి కేకలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ర్యాంక్‌తో పోలిస్తే ఈ ఏడాది మూడు స్థానాలకు కోల్పోయింది. 2013 నుండి 2017 మధ్య డేటా ఆధారంగా ఈ స్థానాలు నిర్ణయించబడతాయి.
ప్రధాన సూచికలు
ఈ నివేదికలో ఆకలి స్థాయిలను లెక్కించడానికి నాలుగు ప్రధాన సూచికలను ఉపయోగిస్తారు. వెల్త్‌హంగర్‌లైప్‌ ద్వారా విడుదల చేసిన ఒక పరిశీలన ప్రచురణ ఆధారంగా వీటిని సూచిస్తారు. (ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్స్టిట్యూట్‌ ఈ సంవత్సరం వరకు ఈ ప్రచురణతో కూడా పాలుపంచుకుంది). మొదటి సూచిక పోషకాహార లోపం, ఇది పోషకాహారలోపాన్ని కలిగి ఉన్న చిన్నారులు, తగినంత కెలోరీలను తీసుకోకపోవడాన్ని ప్రతిబింబిస్తుంది. తదుపరి మూడు సూచికలు ఐదు సంవత్సరాలలోపు పిల్లల సమాచారాన్ని ఆధారంగా చేసుకుంటాయి. చైల్డ్‌ వృధా (ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం), తీవ్రమైన పౌష్టికాహార లోపం, చైల్డ్‌ స్టన్టింగ్‌ (వయస్సు తగ్గ ఎత్తు లేకపోవడం(పెరుగుదల), దీర్ఘకాలిక పోషకాహార లోపం, పిల్లల మరణాలను ఈ మూడు సూచికలు ప్రతిబింబిస్తాయి.
అయితే పైన పేర్కొన్న సంవత్సరాల్లో మూడు సూచికల్లో భారత్‌ కొంత మెరుగుపడింది. జనాభాలో పోషకాహారలోపం గల చిన్నారుల శాతం 2000లో 18.2 శాతం ఉండగా 2018లో 14.8 శాతానికి తగ్గింది. పిల్లల మరణాల శాతం కూడా 9.2 శాతం నుండి 4.3 శాతానికి తగ్గింది. అదే సమయంలో శిశువు పెరుగుదల కూడా 54.2 శాతం నుండి 38.4 శాతానికి పడిపోయింది. అయితే పిల్లల ఎత్తుకు తగ్గ బరువులో మాత్రం మునుపటి సంవత్సరాలతో పోలిస్తే మరింత దిగజారిందని నివేదిక పేర్కొంది. 2000 లో 17.1 శాతం వద్ద నమోదుకాగా, 2005 లో 20 శాతానికి చేరుకోగా, 2018లో 21 శాతానికి పెరిగింది. దక్షిణ సుడాన్‌లో దీని శాతం 28 వద్ద ఉంది. దక్షిణాసియాలో చైల్డ్‌ వృథా ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. ఐక్యరాజ్యసమితి సంస్థల నివేదిక పేర్కొంది. ఈ వృథా అనేది ఎక్కువగా నవజాత శిశువు నుండి ఐదుసంవత్సరాల్లో చిన్నారుల్లో ఎక్కువ ఉన్నట్లు గుర్తించింది.   children