భారతీయ అమెరికన్‌కు అరుదైన గుర్తింపు

Header Banner

భారతీయ అమెరికన్‌కు అరుదైన గుర్తింపు

  Fri Oct 19, 2018 15:47        APNRT, Auto, అమరావతి కబుర్లు, India, Telugu, World


అమ‌రావ‌తి ః అమెరికాలో ఓ భారతీయ అమెరికన్‌కు అరుదైన గుర్తింపు లభించింది. మానవుల అక్రమ రవాణాపై చేసిన పోరాటానికి గానూ మినల్‌ పటేల్‌ దవీస్‌ అనే మహిళను అమెరికా అధ్యక్షుడి పురస్కారం వరించింది. మానవుల అక్రమ రవాణాను నిరోధించేందుకు హూస్టన్‌ నగర మేయర్‌ సిల్వెస్టర్‌ టర్నర్‌కు ఆమె సలహాదారుగా పనిచేశారు. శ్వేత సౌధంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పాంపియో చేతుల మీదుగా ప్రెసిడెన్సీ పతకాన్ని ఆమె అందుకున్నారు. అమెరికాలోనే అత్యున్నత గౌరవం దక్కినందుకు గర్వంగా ఉందని ఆమె అన్నారు.

అమెరికాలో నాలుగో పెద్ద నగరం హూస్టన్‌‌లో మానవుల అక్రమ రవాణా నిరోధించేందుకు ఆ నగర మేయర్‌కు సలహాదారుగా ఆమె 2015లో నియమితులయ్యారు. ఈ క్రమంలో విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.   nri