మ‌ళ్లీ అధికారం మ‌న‌దే...చంద్ర‌బాబు

Header Banner

మ‌ళ్లీ అధికారం మ‌న‌దే...చంద్ర‌బాబు

  Sat Oct 20, 2018 15:19        APNRT, Auto, అమరావతి కబుర్లు, India, Telugu, World


అందుకే ప్రతిపక్షాల అక్కసు
విజ‌య‌వాడ ః బీజేపీ, జనసేన, వైసీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు టీడీపీనే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. వీటి లాలూచీ రాజకీయాలను ఊరూవాడా ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. ‘కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం లేకపోగా ఎదురుదాడులు చేస్తున్నారు. వాళ్లు ఏది చేసినా బూమ్‌రాంగ్‌ అవుతోంది. ఆ 4 పార్టీలు మనల్ని ఎంత టార్గెట్‌ చేస్తే.. మనకు అంత లాభం. వాళ్ల తిట్లే మనకు దీవెనలు. ప్రజాభిమానమే మనకు నైతిక బలం. ప్రభుత్వంపై ప్రజల సంతృప్తి 57% నుంచి 76%కు పెరిగింది. మళ్లీ మీరే రావాలని సామాన్యులు, పేదలు నినాదాలు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఓటర్ల నమోదు, శాసనమండలి ఎన్నికలు, బూత్‌ కన్వీనర్ల శిక్షణ, గ్రామ వికాసం పురోగతిపై టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జులు, ప్రధాన కార్యదర్శులు, నేతలతో శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.‘రాష్ట్రం కోసం మనం పోరాడుతుంటే.. ప్రత్యర్థి పార్టీలు మనపై పోరాటం చేస్తున్నాయి. ప్రజాభిమానం మనపైనే ఉంది. అందుకే ఆ పార్టీలు అక్కసు పెంచుకున్నాయి. మనల్ని ప్రజలకు దూరం చేయాలని కుట్రలు చేస్తున్నాయి’ అని ధ్వజమెత్తారు. ‘ఎప్పుడూ ప్రజల్లోనే ఉండడం ఆనందం. గ్రామాలకు పోవడం మంచి అలవాటు. ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టాలి. లాలూచీ రాజకీయాలను ఎండగట్టాలి. జగన్‌ పాదయాత్రకు ప్రజల్లో స్పందన లేదు. మరో నాలుగేళ్లు నడచినా ఫలితం రాదు’ అని చెప్పారు.   cm